శనివారం ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో హ్యుందాయ్ క్రెటా కారు ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. ఆటోరిక్షా డ్రైవర్ కూడా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ధాంపూర్‌లోని 74వ జాతీయ రహదారిపై మరో వాహనాన్ని ఓవర్‌టేక్ చేస్తున్న క్రెటా కారు ఆటోరిక్షాను ఢీకొట్టింది. నవ వధువుతో సహా ఆరుగురు కుటుంబ సభ్యులు అక్కడికక్కడే మృతి చెందగా, ఆటోరిక్షా డ్రైవర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఈ ప్రమాదంలో అప్పుడే పెళ్లి చేసుకుని వస్తున్న జంట ప్రాణాలు పోయాయి. పొగమంచు కమ్మేయడంతో బాధితులు ప్రయాణిస్తున్న వాహనానికి ముందు వెళ్తున్న టెంపో కనిపించకపోవడంతో దానిని బలంగా ఢీకొట్టింది.
ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కొత్త జంటకు నిన్న సాయంత్రమే ఝార్ఖండ్‌లో వివాహమైంది. అనంతరం వాహనంలో ధామ్‌పూర్‌లోని వరుడి ఇంటికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో వధూవరులు, అత్తమామలు, వరుడి సోదరుడు సహా వాహనంలో 11 మంది ఉన్నారు. పొగమంచు కారణంగా దారి కనిపించకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.