నవజాత ఆడ శిశువు, 6 నెలల బాలుడు మృతి.. నానమ్మ, అమ్మ అరెస్ట్‌

ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో ఒక మహిళ తన 6 నెలల కొడుకును చెరువులో పడేసి చంపింది.

By అంజి  Published on  6 April 2023 11:02 AM IST
Chhattisgarh,  Crime news

నవజాత ఆడ శిశువు, 6 నెలల బాలుడు మృతి.. నానమ్మ, అమ్మ అరెస్ట్‌

ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో ఒక మహిళ తన 6 నెలల కొడుకును చెరువులో పడేసి చంపింది. తన భర్త మద్యానికి బానిస కావడం, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుండంతో ఈ దారుణానికి పాల్పడిందని పోలీసులు బుధవారం తెలిపారు. ఇక మరో ఘటన సూరజ్‌పూర్ జిల్లాలో జరిగింది. నవజాత బాలికను ఆమె నానమ్మ బావిలో పడవేసింది. నాననమ్మ తన కొడుకు, కోడలు నుండి మగబిడ్డను కోరుకుందని, అయితే ఆడపిల్ల పుట్టడంతో హత్య చేసిందని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరినీ ఆయా జిల్లాల పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.

దుర్గ్ జిల్లాలోని పుల్గావ్ గ్రామానికి చెందిన మల్తీ యాదవ్ (30) మార్చి 31న ప్రకృతి పిలుపు మేరకు వెళ్లి.. ఇంటికి తిరిగి వచ్చేసరికి రాత్రి తన బిడ్డ కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారని దుర్గ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అభిషేక్ పల్లవ తెలిపారు. మరుసటి రోజు సమీపంలోని చెరువులో చిన్నారి మృతదేహం తేలుతూ కనిపించడంతో పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీలో.. మార్చి 31 తెల్లవారుజామున 2:40 గంటల సమయంలో మహిళ (బాలుడి తల్లి) తన చేతుల్లో శిశువును పట్టుకుని చెరువు వైపు వెళుతున్నట్లు కనిపించిందని పల్లవ తెలిపారు.

ఆమె మొదట పోలీసులను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించింది, కానీ తర్వాత నేరం చేసినట్లు అంగీకరించిందని తెలిపారు. తన భర్త మద్యానికి బానిసయ్యాడని, తనను తన తల్లి వద్ద వదిలి వెళ్లాడని ఆ మహిళ పోలీసులకు తెలిపింది. ఇంటి ఖర్చులకు డబ్బులు ఇవ్వకపోవడంతో కొడుకు ఎలా బతుకుతాడోనని ఆందోళన చెందింది. ఆవేశంతో ఆ మహిళ తన బిడ్డను చంపి చెరువులో పడేసింది అని ఎస్పీ తెలిపారు.

ఇక రెండవ సంఘటన.. సూరజ్‌పూర్ జిల్లా బిష్రాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కరంజి గ్రామానికి చెందిన మితాలీ బిస్వాస్ (48) తన నవజాత మనవరాలిని చంపినందుకు అరెస్టు చేసినట్లు స్థానిక పోలీసు అధికారి తెలిపారు. ఏప్రిల్ 1న, నవజాత శిశువు తండ్రి పంకజ్ బిస్వాస్ తన 15 రోజుల కుమార్తె తన ఇంటి నుండి కనిపించకుండా పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారని ఆయన చెప్పారు. అనంతరం బిస్వాస్ ఇంటి ఆవరణలో ఉన్న బావి నుంచి నవజాత శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. విచారణలో తన కొడుకు, కోడలు నుండి మగపిల్లాడు కావాలని తన మనవరాలిని చంపినట్లు ఆడశిశువు నానమ్మ పోలీసులకు చెప్పిందని పోలీసులు చెప్పారు.

రెండు కేసుల్లోనూ నిందితులపై హత్యానేరం నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Next Story