దసరా పండుగ సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఓ పురుష హక్కుల సంస్థ ఈసారి శూర్పణఖ దహన కార్యక్రమం నిర్వహించేందుకు నిర్ణయించుకుంది. భర్తలను పొట్టనపెట్టుకున్న భార్యల తీరుకు నిరసనగా ఈ కార్యక్రమం నిశ్చయించినట్టు పౌరుష్ అనే సంస్థ ప్రకటించింది. హనీమూన్‌లో భర్తను హత్య చేసిన యువతి సోనమ్ రఘువంశీ, భర్తను చంపి డ్రమ్ములో పాతిపెట్టిన మీరట్ యువతి ముస్కాన్‌తో పాటు పలు మహిళా నిందితుల ఫొటోలను దిష్టిబొమ్మపై పెట్టి దహనం చేయనున్నారు.
దిష్మి బొమ్మ మధ్యలో సోనమ్ సూర్యవంశీ ఫొటో పెడతామని, ఆమె ఇండోర్‌కు చెడ్డ పేరు తెచ్చిందని నిర్వాహకులు తెలిపారు. ఆమెతోపాటు భర్తను పొట్టన పెట్టుకున్న ముస్కాన్, నికితా సింఘానియా వంటి మొత్తం 10 మంది మహిళల ఫొటోలు బొమ్మపై ఏర్పాటు చేస్తామని ఈ పురుషుల సంఘం తెలిపింది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఓ పోస్టర్‌ను కూడా వారు విడుదల చేశారు