అత్తను చంపిన అల్లుడు.. మృతదేహాన్ని 10 ముక్కలు చేసి బకెట్‌లో నింపి..
Nephew kills aunt, chops body in 10 pieces with marble cutter. ఢిల్లీలో తన లైవ్-ఇన్-పార్ట్‌నర్ చేత హత్య చేయబడిన శ్రద్ధా వాకర్ ఘటన దేశవ్యాప్తంగా
By అంజి Published on 18 Dec 2022 11:03 AM ISTఢిల్లీలో తన లైవ్-ఇన్-పార్ట్‌నర్ చేత హత్య చేయబడిన శ్రద్ధా వాకర్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, తాజాగా అలాంటి ఘటనే రాజస్థాన్‌లోని జైపూర్ వెలుగు చూసింది. మేనల్లుడు తన వితంతువు అత్తను చంపి, ఆమె మృతదేహాన్ని మార్బుల్ కట్టర్ మిషన్‌తో 10 ముక్కలుగా నరికి అడవిలో వేర్వేరు ప్రదేశాల్లో పడేశాడు. పోలీసులు నిందితుడు అనుజ్ శర్మ అలియాస్ అచింత్య గోవిందదాస్‌ను అరెస్టు చేశారు. అడవి నుండి కొన్ని శరీర భాగాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మహిళ యొక్క ఇతర శరీర భాగాల కోసం పోలీసులు ఇంకా వెతుకుతున్నారు.
శ్రద్ధా హత్యలా?
జైపూర్‌లోని విద్యాధర్‌నగర్ ప్రాంతంలోని లాల్‌పురియా అపార్ట్‌మెంట్ సెక్టార్-2లో ఈ ఘటన జరిగింది. డిసెంబర్ 11న అనుజ్ తన అత్త సరోజ్ శర్మ (64)ని సుత్తితో తలపై కొట్టి హత్య చేశాడు. ఆ తర్వాత తన బాత్‌రూమ్‌లోని మార్బుల్ కట్టర్ మెషీన్‌ను ఉపయోగించి మృతదేహాన్ని అడవిలో పారవేసే ముందు 10 ముక్కలుగా నరికాడు. దీంతో అతడు స్వయంగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని అనుమానం రాకుండా ఉండేందుకు తన అత్త మిస్సింగ్ రిపోర్టును సమర్పించాడు. అయితే కిచెన్‌లోని రక్తపు మరకలను అనూజ్ కడుగుతుండగా అత్త కూతురు పూజకు పట్టుబడ్డాడు. ఆ తర్వాత మృతురాలి కుమార్తె పూజ.. అనూజ్‌పై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి, పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
డీసీపీ నార్త్ ప్యారిస్ దేశ్‌ముఖ్ మాట్లాడుతూ.. సరోజ భర్త మరణించిన తర్వాత ఆమె మేనల్లుడు అనుజ్ ఆమెను చూసుకునేవాడు. అనూజ్ ఖర్చులు ఆమె పూర్తిగా భరించేది. సరోజ్‌కి విదేశాల్లో ఉండే కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే కొన్ని రోజులుగా ఆమె తన విషయాల్లో జోక్యం చేసుకుంటుండటం అనూజ్‌కి నచ్చలేదు. అతను తన బి.టెక్ పూర్తి చేసిన తర్వాత హరే కృష్ణ ఉద్యమంలో చేరాడు. డిసెంబరు 11న అతడు ఢిల్లీకి వెళ్లాల్సి ఉండగా అత్త నిరాకరించడంతో కోపోద్రిక్తుడై ఆమెను హత్య చేశానని తెలిపాడు.
మృతదేహాన్ని పారవేయడానికి, అతను సికార్ రోడ్‌లో ఉన్న హార్డ్‌వేర్ దుకాణం నుండి మార్బుల్ కట్టర్ మిషన్‌ను తీసుకువచ్చాడు. అనంతరం మృతదేహాన్ని 10 ముక్కలుగా నరికి సూట్‌కేస్‌లో, బకెట్‌లో నింపి ఢిల్లీ రోడ్డు వైపు అడవిలోని వివిధ ప్రాంతాల్లో విసిరేశాడు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహిళ ఇతర శరీర భాగాల ఆచూకీ కోసం అడవిలో గాలిస్తున్నారు.