దారుణం.. 20 నెలల చిన్నారిపై అత్యాచారం

Neighbour rapes 20-month-old baby in Worli. ముంబైలోని వర్లీ ప్రాంతంలో 20 నెలల చిన్నారిపై అత్యాచారం చేశాడు ఓ కామాంధుడు.

By M.S.R  Published on  23 Jan 2023 7:43 PM IST
దారుణం.. 20 నెలల చిన్నారిపై అత్యాచారం

ముంబైలోని వర్లీ ప్రాంతంలో 20 నెలల చిన్నారిపై అత్యాచారం చేశాడు ఓ కామాంధుడు. ఈ దారుణానికి తెగబడ్డ 35 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. బాధితురాలి తల్లి వాంగ్మూలం ఆధారంగా, వర్లీ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, అతనిపై ఐపిసి సెక్షన్ 376, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరు పరిచారు. నిందితుడు, బాధితురాలు ఇద్దరూ ఒకే ప్రాంతానికి చెందిన వారని పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక తల్లి కొద్దిసేపు ఇంటి నుంచి బయటకు వెళ్లడంతో నిందితుడు బాలిక దగ్గరకు వచ్చాడు. ఆ తర్వాత వేరే ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి తిరిగి వచ్చినప్పుడు, బాలిక ఏడుస్తూ ఉండటంతో ఆమెకు కొన్ని సందేహాలు వచ్చాయి. బాలికను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా, బాలికపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు ఆమెకు తెలిపినట్లు పోలీసులు తెలిపారు. బాలిక తల్లి సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసు నమోదు చేసింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుడిని అరెస్ట్ చేశారు.

Next Story