ముంబైలో దారుణం.. మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని కాల్చి చంపేశారు
మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్‌సీపీ నేత బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య ముంబైలో కలకలం రేపింది.
By అంజి Published on 13 Oct 2024 1:25 AM GMTముంబైలో దారుణం.. మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని కాల్చి చంపేశారు
మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్‌సీపీ నేత బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య ముంబైలో కలకలం రేపింది. శనివారం సాయంత్రం ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. 66 ఏళ్ల రాజకీయ నాయకుడి కడుపు, ఛాతీపై కాల్పులు జరిగాయి. వెంటనే లీలావతి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ సంఘటన రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఎన్‌సిపి నాయకుడి కార్యాలయానికి సమీపంలోని రామమందిర్ సమీపంలో జరిగింది. ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు సిద్ధిఖీ క్లోజ్ ఫ్రెండ్. విభేదాల సమయంలో షారుఖ్, సల్మాన్ మధ్య సయోధ్య కుదిర్చి బాబా ఫేమస్ అయ్యారు.
దసరా సందర్భంగా సిద్ధిక్ బాణాసంచా పేలుస్తుండగా, వాహనంలో నుంచి ముగ్గురు వ్యక్తులు రుమాలు కప్పుకుని బయటకు వచ్చారు. వారు 9.9 ఎంఎం పిస్టల్‌తో కాల్పులు జరిపారు, మూడు రౌండ్లు కాల్పులు జరిపారు, అందులో ఒకటి సిద్ధిఖీ ఛాతీపై కొట్టడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. బుల్లెట్లలో ఒకటి బాబా సిద్ధిక్ వాహనం యొక్క విండ్‌షీల్డ్‌ను పగులగొట్టింది, ఇది బహుళ కాల్పులు జరిగినట్లు నిర్ధారించబడింది. ఆన్‌లైన్‌లో వెలువడిన మరో వీడియో ప్రకారం, ఘటనా స్థలం నుండి పోలీసులు మూడు బుల్లెట్ కేసింగ్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు: ఒకరు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు, మరొకరు హర్యానాకు చెందినవారు.
మరోవైపు బాబా హత్యకు గురికావడానికి బాధ్యత వహిస్తూ సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ రాజీనామా చేయాలని శివసేన (యూబీటీ) డిమాండ్ చేశాయి. వై కేటగిరీ భద్రత కలిగిన రాజకీయ నేతనే కాపాడలేని ఈ ప్రభుత్వం ఇక సామాన్య ప్రజలను ఏం కాపాడుతుందని ప్రశ్నించాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ధ్వజమెత్తాయి.