Video : నిన్ను చూసి గర్విస్తున్నాను.. క‌న్నీళ్లు దిగ‌మింగుతూ భ‌ర్త‌కు క‌డ‌సారి వీడ్కోలు ప‌లికిన హిమాన్షి

పహల్గామ్ ఉగ్రదాడిలో వీరమరణం పొందిన ఇండియన్ నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ మృతదేహం ఈరోజు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది.

By Medi Samrat
Published on : 23 April 2025 4:53 PM IST

Video : నిన్ను చూసి గర్విస్తున్నాను.. క‌న్నీళ్లు దిగ‌మింగుతూ భ‌ర్త‌కు క‌డ‌సారి వీడ్కోలు ప‌లికిన హిమాన్షి

పహల్గామ్ ఉగ్రదాడిలో వీరమరణం పొందిన ఇండియన్ నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ మృతదేహం ఈరోజు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. ఆయన సతీమణి హిమాన్షి ఆయనకు భావోద్వేగంతో నివాళులర్పించారు. హిమాన్షి క‌న్నీళ్లు దిగ‌మింగుతూ.. వినయ్ త్యాగానికి దేశం గర్విస్తోంది, జై హింద్ అని అన్నారు. వినయ్, హిమాన్షి ఏప్రిల్ 16న వివాహం చేసుకున్నారు. ఇద్దరూ హనీమూన్ కోసం పహల్గామ్ వెళ్లారు. వినయ్ నేవీలో చేరి మూడేళ్లయింది.

పహల్గామ్ ఉగ్రదాడి తరువాత హృదయ విదారక చిత్రం వైరల్ అయ్యింది. ఇది ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. నేవీ అధికారి వినయ్ నర్వాల్ చనిపోగా.. అతని భార్య హిమాన్షి అతని పక్కన కూర్చున్నట్లు చిత్రంలో కనిపిస్తుంది.

హిమాన్షి ఢిల్లీ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ చేస్తుండ‌గా.. వినయ్ తండ్రి సునీల్ కుమార్ హర్యానా ప్రభుత్వంలో అధికారి. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు వినయ్. మూడేళ్ల క్రితం నేవీలో చేరి కొచ్చిలో ఉద్యోగంలో చేరాడు. ఇప్పుడే వైవాహిక సెలవుపై వచ్చారు.

వినయ్ కుటుంబం కర్నాల్‌లోని భుస్లి గ్రామానికి చెందినది. ప్రస్తుతం సెక్టార్-7లో నివసిస్తున్నారు. మే 1న వినయ్ పుట్టినరోజు. ఉగ్రవాదుల దాడి గురించి హిమాన్షి తన బంధువులకు ఫోన్‌లో సమాచారం అందించారు. అందరూ అవాక్కయ్యారు.

Next Story