హైదరాబాద్ శివారులో భారీగా గంజాయి పట్టుబడింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నగర శివార్లలో 813 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసింది. నిర్దిష్ట సమాచారం మేరకు NCB హైదరాబాద్ బృందాలు ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా నుండి మహారాష్ట్రలోని లాతూర్‌కు గంజాయిని రవాణా చేస్తున్న ప్రత్యేకంగా సవరించిన లారీని నగర శివార్లలో అడ్డుకున్నాయి.
లారీ గడువు ముగిసినా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కలిగి ఉన్నట్లు ఎన్సీబీ అధికారులు గుర్తించారు. రహస్యంగా లారీలో వస్తువులను దాచడానికి ట్యాంక్‌ను పోలిన స్థూపాకార కుహరం ఉంది. ఆ కుహరాన్ని గడ్డిని ఉపయోగించి కప్పిపెట్టి టార్పాలిన్ షీట్‌తో కప్పారు. దాని లోపల దాచిన 813 కిలోగ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు NCB అధికారులు తెలిపారు. కాగా ముగ్గురు నిందితులను బీదర్ వాసులుగా గుర్తించారు.