వ‌ద్దంటున్నా నగ్నంగా మహిళల కంపార్ట్మెంట్ లోకి ఎక్కాడు

ముంబైలోని సబర్బన్ రైలులోని మహిళా కంపార్ట్‌మెంట్‌లోకి ఓ వ్యక్తి నగ్నంగా ప్రవేశించాడు.

By Medi Samrat  Published on  18 Dec 2024 3:28 PM IST
వ‌ద్దంటున్నా నగ్నంగా మహిళల కంపార్ట్మెంట్ లోకి ఎక్కాడు

ముంబైలోని సబర్బన్ రైలులోని మహిళా కంపార్ట్‌మెంట్‌లోకి ఓ వ్యక్తి నగ్నంగా ప్రవేశించాడు. రైల్వే సిబ్బంది అతడిని బయటకు గెంటేయడంతో మహిళా ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం మధ్యాహ్నం ఘట్‌కోపర్‌ రైల్వే స్టేషన్‌లో కల్యాణ్‌ వెళ్తున్న లోకల్‌ ట్రైన్‌ లో ఈ ఘటన చోటుచేసుకుంది. మహిళా ప్రయాణికులు ఎక్కవద్దంటూ వారిస్తున్నా కూడా ఆ వ్యక్తి రైలు నుండి దిగలేదు. కొందరు మహిళలు కేకలు వేయగా, మరికొందరు స్టేషన్ అధికారుల దృష్టిని ఆకర్షించడానికి రైలు కిటికీలను తట్టారు.

టికెట్ కలెక్టర్‌ అక్కడకు చేరుకొని ఆ వ్యక్తిని కంపార్ట్‌మెంట్ నుండి కిందకు గెంటేయించాడు. ప్రభుత్వ రైల్వే పోలీసులకు అతడిని అప్పగించారు. ఆ వ్యక్తి మానసిక స్థితి సరిగా లేదని రైల్వే పోలీసు అధికారులు తెలిపారు.

Next Story