జుట్టు ఊడిపోతుంద‌ని ఆత్మ‌హ‌త్య చేసుకున్న యువ‌తి

Mysore Woman commits suicide due to hair fall problem.సాధార‌ణంగా జుట్టు ఉన్న వ్య‌క్తుల‌తో పోలిస్తే బ‌ట్ట‌త‌ల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 July 2022 11:28 AM IST
జుట్టు ఊడిపోతుంద‌ని ఆత్మ‌హ‌త్య చేసుకున్న యువ‌తి

సాధార‌ణంగా జుట్టు ఉన్న వ్య‌క్తుల‌తో పోలిస్తే బ‌ట్ట‌త‌ల ఉన్న వ్య‌క్తులు వ‌య‌స్సులో పెద్ద‌వారిలా క‌నిపిస్తుంటారు. అందుక‌నే జుట్టు ఊడ‌కుండా ఉండేందుకు ఎన్నో మార్గాల‌ను అన్వేషిస్తుంటారు. అయిన‌ప్ప‌టికీ అదేమీ పెద్ద స‌మ‌స్య కానే కాదు. అయితే.. ఓ మ‌హిళ త‌నకు వెంట్రుక‌లు రాలుతున్నాయ‌ని బాధ‌ప‌డుతూ దారుణ నిర్ణ‌యం తీసుకుంది. ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క రాష్ట్రంలో చోటు చేసుకుంది.

వివ‌రాల్లో వెళితే.. మైసూర్ న‌గ‌రంలోని రాఘ‌వేంద్ర ఎక్స్‌టెన్ష‌న్‌లో కావ్య శ్రీ(21) అనే యువ‌తి త‌న కుటుంబంతో క‌లిసి నివసిస్తోంది. కావ్య శ్రీకి చిన్న‌ప్ప‌టి నుంచి కురులంటే చాలా ఇష్టం. ఎన్నెన్నో షాంపూలు, నూనెల‌తో కంటికి రెప్ప‌లా కాపాడుకుంటూ వ‌స్తోంది. అయితే ఇటీవ‌ల వింత జబ్బు కార‌ణంగా త‌న వెంట్రుక‌లు రాల‌డం మొద‌ల‌య్యాయి. చూస్తుండ‌గానే జుట్టు మొత్తం ఊడిపోతుంది. దీన్ని నివారించేందుకు ఎన్ని చికిత్స‌లు తీసుకున్న‌ప్ప‌టికీ ఫ‌లితం శూన్యం. దీంతో కావ్య శ్రీ తీవ్ర నిరాశ‌కు లోనైంది. ఈ క్ర‌మంలో దారుణ నిర్ణ‌యం తీసుకుంది. ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. మృత‌దేహాన్ని ప‌రిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story