మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలో 10 ఏళ్ల ముస్లిం బాలుడిపై దాడి చేసినందుకు 22 ఏళ్ల యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్యూషన్ క్లాసులకు వెళుతున్న 5వ తరగతి విద్యార్థి బాలుడిని సదరు యుబకుడు ఆపి.. 'జై శ్రీరాం' అని నినాదాలు చేయమని బలవంతం చేసాడు. దీంతో బాలుడు మౌనంగా ఉండిపోయాడు. మాట్లాడకపోవటంతో బాలుడి చెంపలపై యువకుడు కొట్టాడు. మత విశ్వాసాలను రెచ్చగొట్టేలా వ్యవహరించిన నిందితుడిపై పంధానా పోలీసులు కేసు నమోదు చేశారు.
భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 295-A (ఉద్దేశపూర్వకంగా, హానికరమైన చర్యలు, వారి మతాన్ని లేదా మత విశ్వాసాలను అవమానించడం ద్వారా వారి మతపరమైన భావాలను రెచ్చగొట్టే ఉద్దేశ్యంతో), 323 (స్వచ్ఛందంగా గాయపరిచినందుకు శిక్ష) కింద పంధాన పోలీసులు యువకుడిపై కేసు నమోదు చేశారు. ట్యూషన్‌కు వెళుతుండగా.. అజయ్ అలియాస్ రాజు భిల్ దారిలో ఆపి 'జై శ్రీరాం' అని బలవంతం చేశాడని 10 ఏళ్ల చిన్నారి తండ్రి పంధానా పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేసినట్లు ఖడ్వా డీఎస్పీ అనిల్ చౌహాన్ తెలిపారు. చర్చించిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తమ బిడ్డ నవోదయ విద్యాలయానికి ప్రిపేర్ అవుతున్నాడని, దాని కోసం ట్యూషన్ తీసుకుంటున్నాడని బాధిత కుటుంబీకులు పోలీసులకు తెలిపారు. చిన్నారికి తెలిసిన అజయ్ అలియాస్ రాజు తండ్రి లక్ష్మణ్ భిల్ దుర్గా కాలనీ సమీపంలో అడ్డుకున్నాడని వారు తెలిపారు.