దారుణం.. నడి రోడ్డుపై హత్య

Murder On Busy Karnataka Street Caught On Camera. కర్ణాటక రాష్ట్రంలోని ఓ గ్రామంలో రద్దీగా ఉండే వీధిలో 26 ఏళ్ల యువకుడిని నరికి చంపారు.

By M.S.R
Published on : 28 Feb 2023 7:30 PM IST

దారుణం.. నడి రోడ్డుపై హత్య

కర్ణాటక రాష్ట్రంలోని ఓ గ్రామంలో రద్దీగా ఉండే వీధిలో 26 ఏళ్ల యువకుడిని నరికి చంపారు. కెమెరాకు చిక్కిన ఈ దారుణ హత్య కర్ణాటకలోని బీదర్ జిల్లా త్రిపురాంత్ గ్రామంలో జరిగింది. నలుగురైదుగురు వ్యక్తులు కత్తి, ఇతర పదునైన ఆయుధాలతో రద్దీగా ఉండే జంక్షన్‌లోనే దాడికి తెగబడ్డారు. ఆనంద్ ఫూలే అనే వ్యక్తిపై దాడి చేయడం పలువురు వ్యక్తులు గమనించారు. ఇది ప్రతీకార హత్య అని పోలీసులు చెప్పారు.

గతంలో చోటు చేసుకున్న గొడవల కారణంగా ఆనంద్ ఫూలేపై ప్రతీకారం తీర్చుకోవడానికి దుండగులు ఈ హత్య చేయాలని ప్లాన్ చేశారని కర్ణాటక పోలీసులు తెలిపారు. దాడి చేసినవారు తప్పించుకోగలిగారని.. క్లూస్ కోసం వెతుకుతున్నారని, వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. దాడిలో గాయపడిన ఫూలేను ఉమర్గా ఆస్పత్రికి తరలిస్తూ ఉండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ దాడిలో ఫూలే స్నేహితుడు మరో వ్యక్తి కూడా గాయపడి ప్రస్తుతం బీదర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఫూలే స్నేహితుడి నుంచి సేకరించిన సమాచారం మేరకు నిందితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


Next Story