హైదరాబాద్‌లోని కుషాయిగూడలో వృద్ధురాలి హత్య వెలుగులోకి వచ్చింది. హత్య చేయడమే కాకుండా ఆమె మృత మృతదేహంపై నృత్యం చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన కమలాదేవీ 30 ఏళ్లుగా కుషాయిగూడలో ఉంటోంది. ఆమె నాలుగు కిరాణా దుకాణాలను నిర్వహిస్తోంది. అందులో పని చేసే 17 ఏళ్ల వయస్సున్న మైనర్ బాలుడితో రూమ్ రెంట్ విషయంలో గొడవ పడింది. ఈ క్రమంలోనే కమలాదేవిపై యువకుడు కక్ష పెంచుకున్నాడు.
ప్లాన్ ప్రకారం.. సదరు యువకుడు ఆమెను చంపాడు. ఆమె మృతదేహంపై డ్యాన్స్ చేస్తూ, వీడియో తీశాడు. ఆ తర్వాత వీడియోని తన మిత్రులందరికీ షేర్ చేశాడు. తదనంతరం ఇంటికి తాళం వేసి పారిపోయాడు. ఇంట్లో నుండి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంట్లో డెడ్‌బాడీని గుర్తించి, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.