హైదరాబాద్‌లో శ్రద్ధా వాకర్ మర్డర్ కేసు తరహా ఘటన..!

Murder In Balapur. శ్రద్ధా వాకర్ మర్డర్ కేసు తరహా ఘటన హైదరాబాద్‌లోని బాలాపూర్‌లో వెలుగులోకి వచ్చింది.

By M.S.R  Published on  27 Dec 2022 5:27 PM IST
హైదరాబాద్‌లో శ్రద్ధా వాకర్ మర్డర్ కేసు తరహా ఘటన..!

శ్రద్ధా వాకర్ మర్డర్ కేసు తరహా ఘటన హైదరాబాద్‌లోని బాలాపూర్‌లో వెలుగులోకి వచ్చింది. గత నెల 27వ తేదీన అదృశ్యమైన బొర్ర బాలమ్మ అనే మహిళ దారుణ హత్యకు గురైంది. నగల కోసం బాలమ్మను దారుణంగా హతమార్చిన దుండగులు. ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి తగలబెట్టారు. అనంతరం నిందితులు ఆ బూడిదను కాలువలో కలిపినట్లు పోలీసులు తెలిపారు. బాలమ్మను కిరాతకంగా చంపిన నిందితులు ఆమె ఒంటిపై ఉన్న నగలు దోచుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. బాలమ్మను హత్య చేసిన నిందితులు రాములు, లలితను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి 6 తులాల బంగారం, 159 కిలోల వెండి రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.

బొర్ర బాలమ్మ అనే మహిళ గత నెల 27వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. దీంతో మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఆమె హత్యకు గురైనట్లు సోమవారం ధృవీకరించారు. బాధితురాలిని హత్య చేసి ఆమె నుంచి నగలను దోచుకున్నారు. ఆపై మృతదేహాన్ని ముక్కలు చేసి.. కాల్చేసి ఆ బూడిదను మురికి కాలువలో కలిపేశారు.


Next Story