బ్రేకింగ్‌: ములుగు జిల్లా: వాహనం బోల్తా.. 30 మంది కూలీలకు గాయాలు

Mulugu road accident I బ్రేకింగ్‌: ములుగు జిల్లా: వాహనం బోల్తా.. 30 మంది కూలీలకు గాయాలు

By సుభాష్  Published on  5 Dec 2020 11:46 AM IST
బ్రేకింగ్‌: ములుగు జిల్లా:   వాహనం బోల్తా.. 30 మంది కూలీలకు గాయాలు

ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏటూరు నాగారం మండలం కేంద్రానికి సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు బొలెరో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. వాహనంలో 35 మంది వరకు ఉన్నట్లు సమాచారం. అయితే గాయాలైన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story