Mulugu: అడవిలో అంగన్వాడీ టీచర్‌ శవం.. చెట్టుకు వేలాడుతూ..

తాడ్వాయి అడవుల్లో అంగన్‌వాడీ టీచర్‌ శవమై కనిపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడ్వాయి మండలం కథాపురం గ్రామంలో సుజాత అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్నారు.

By అంజి  Published on  15 May 2024 2:21 PM GMT
Mulugu, Anganwadi teacher,Tadvai forest, Crime

Mulugu: అడవిలో అంగన్వాడీ టీచర్‌ శవం.. చెట్టుకు వేలాడుతూ..

ములుగు: తాడ్వాయి అడవుల్లో బుధవారం ఉదయం 48 ఏళ్ల అంగన్‌వాడీ టీచర్‌ శవమై కనిపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడ్వాయి మండలం కథాపురం గ్రామంలో సుజాత అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం విధులు ముగించుకుని స్వగ్రామం ఏటూరునాగారం వెళ్లాలి. అయితే ఆమె స్వగ్రామానికి చేరుకోలేదు. బుధవారం ఉదయం తాడ్వాయి మండలం నాంపల్లి అడవిలో ఆమె మృతదేహాన్ని కొందరు తూనీకాకు కూలీలు గుర్తించారు.

సుజాతను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని సీఐ శంకర్‌, ఎస్సై శ్రీకాంత్‌ రెడ్డి పరిశీలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుజాత మృతదేహం అడవిలో చెట్టుకు వేలాడుతూ కనిపించింది. ఆమె మెడలోని నగలు, సెల్ ఫోన్, హ్యాండ్ బ్యాగ్ కనిపించలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సుజాత అనుమానాస్పద మృతిపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Next Story