ప్రియుడి కోసం కన్నకూతురినే గొంతునులిమి చంపేసిందో కర్కశ తల్లి. ఆపై గ్రామ శివారులో కూతురి డెడ్‌బాడీని పూడ్చి పెట్టింది. ఈ దారుణ ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం శభాష్‌పల్లిలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మమతకు భాస్కర్‌తో వివాహం కాగా ఇద్దరు పిల్లలు చరణ్ (4), తనుశ్రీ (2) ఉన్నారు. కొన్ని రోజుల కిందట భాస్కర్‌తో కలిసి ఉండలేనంటూ పుట్టింటికి వెళ్లిన ఆమెకు ఫయాజ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. కొడుకును తన తల్లి వద్దే వదిలేసి పాపను తీసుకుని ప్రియుడితో వెళ్లిపోయింది. అదే రోజు తనుడ శ్రీని గొంతునులిమి చంపి గ్రామ శివారులో పాతిపెట్టింది.
మే 27వ తేదీ నుండి తన కూతురు, భార్య కనిపించడం లేదని మమత భర్త భాస్కర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. మమత, ఆమె ప్రియుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో వారి ఫోన్ సిగ్నల్ ఆధారంగా గుంటూరులో మమత, ఫయీజ్ (30)ని తాజాగా గుర్తించారు. మమతను విచారించగా కూతురిని చంపినట్లు ఒప్పుకుంది. దీంతో పోలీసులు వారిని ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. అక్కడ సమాధిని తవ్వి చిన్నారి మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు జరుగుతోంది.