హోలీ పండుగ పూట విషాదం.. ఇద్ద‌రు చిన్నారుల‌ను చెరువులో తోసి త‌ల్లి ఆత్మ‌హ‌త్య‌

Mother Commits Suicide with two Childerns in Rajanna Sircilla District.హోలీ పండుగ పూట రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో విషాదం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 March 2022 6:33 AM GMT
హోలీ పండుగ పూట విషాదం.. ఇద్ద‌రు చిన్నారుల‌ను చెరువులో తోసి త‌ల్లి ఆత్మ‌హ‌త్య‌

హోలీ పండుగ పూట రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ క‌ల‌హాల‌తో ఓ వివాహిత త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి చెరువులో దూకి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల మేర‌కు గంభీరావుపేట మండలంలోని కొత్తపల్లిలో రాజు, రేఖ దంప‌తులు నివ‌సిస్తున్నారు. వీరికి అభిజ్ఞ‌(3), ఐదు నెల‌ల చిన్నారి హ‌న్సిక‌ సంతాపం. అయితే.. గ‌త కొంత‌కాలంగా రేఖ‌ను భ‌ర్త, అత్త వేదింపుల‌కు గురిచేస్తున్నారు.

ఈ క్ర‌మంలో శుక్ర‌వారం తెల్ల‌వారుజామున రేఖ త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌ను తీసుకుని గ్రామానికి స‌మీపంలోని చెరువు క‌ట్ట‌పైకి వెళ్లింది. గ‌మ‌నించిన స్థానికులు ఇక్క‌డే ఏం చేస్తున్నావ‌ని రేఖ‌ను అడుగ‌గా.. పిల్ల‌లు ఏడుస్తుంటే ఆడించేందుకు తీసుకువ‌చ్చిన‌ట్లు వారితో చెప్పింది. అయితే.. ఉద‌యం 8 గంట‌ల ప్రాంతంలో చెరువులో ఇద్ద‌రు చిన్నారుల మృత‌దేహాల‌ను స్థానికులు గుర్తించారు. వెంట‌నే పోలీసులకు స‌మాచారం ఇచ్చారు. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు చిన్నారుల మృత‌దేహాల‌ను చెరువులోంచి బ‌య‌ట‌కు తీయించి.. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కుటుంబ క‌ల‌హాల‌తో చిన్నారుల‌ను చెరువులోకి తోసి.. రేఖ ఆత్మ‌హ‌త్య చేసుకుంటుంద‌ని స్థానికులు అనుమానం వ్య‌క్తం చేయ‌గా.. రేఖ మృత‌దేహాం కోసం గ‌జఈత‌గాళ్ల‌తో చెరువులో గాలింపు చేప‌ట్టారు.

Next Story
Share it