ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ అత్యాచార బాధితురాలు మృతి

Molested victim dies at Gorakhpur hospital.ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు తెచ్చిన‌ప్ప‌టికీ మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు ఆగ‌డం లేదు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 April 2022 11:02 AM IST
ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ అత్యాచార బాధితురాలు మృతి

ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు తెచ్చిన‌ప్ప‌టికీ మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు ఆగ‌డం లేదు. నిత్యం ఏదో ఒక చోట మ‌హిళ‌ల‌పై దాడులు జ‌రుగుతూనే ఉన్నాయి. కామంతో క‌ళ్లు మూసుకుపోయిన కామాంధులు క‌న్ను మిన్ను కాన‌డం లేదు. దారుణాల‌కు తెగ‌బ‌డుతున్నారు. ఓ మృగాడి చేతిలో దారుణ అత్యాచారానికి గురైన యువ‌తి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. సంత్ క‌బీర్ న‌గ‌ర్‌లో 22 ఏళ్ల యువతిని ఓ యువ‌కుడు బ‌ల‌వంతం చేశాడు. అయితే.. ఆ యువ‌తి తీవ్రంగా ప్ర‌తిఘ‌టించ‌డంతో యువ‌కుడు తీవ్రంగా గాయ‌ప‌రిచాడు. అత్యాచారానికి పాల్ప‌డిన అనంత‌రం ఆ యువ‌తిని ఆమె ఇంటి ముందు వ‌దిలివేసి వెళ్లిపోయాడు. తీవ్ర గాయాల‌తో అప‌స్మార‌క స్థితిలో ఉన్న యువ‌తిని గుర్తించిన స్థానికులు, కుటుంబ స‌భ్యులు స్థానికంగా ఉండే ఓ ఆస్ప‌త్రికి తీసుకువెళ్లారు. వారు గోర‌ఖ్‌పూర్ ఆస్ప‌త్రికి రిఫ‌ర్ చేయ‌గా.. అక్క‌డికి తీసుకువెళ్లారు.

గోరఖ్‌పూర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ యువ‌తి సోమవారం మృతి చెందినట్లు ఎస్పీ తెలిపారు. ఏప్రిల్ 9న త‌న‌పై ప్ర‌మోద్ చౌద‌రి అనే వ్య‌క్తి అత్యాచారానికి పాల్ప‌డి, తీవ్రంగా గాయ‌ప‌రిచాడ‌ని ఆ యువ‌తి మ‌ర‌ణానికి ముందు రికార్డు చేసిన వీడియోలో ఉంద‌ని ఎస్పీ చెప్పారు. దీనిపై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టిన‌ట్లు వెల్లడించారు.

Next Story