హోట‌ల్ రూమ్‌లో ఉరి వేసుకుని మోడ‌ల్ ఆత్మ‌హ‌త్య‌.. సూసైడ్ నోట్‌లో ఏముందంటే..?

Model's body found hanging in Mumbai hotel.ముంబైలోని అంధేరీ ప్రాంతంలోని ఓ హోటల్ గదిలో 30 ఏళ్ల మోడల్ ఫ్యాన్‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Sept 2022 10:19 AM IST
హోట‌ల్ రూమ్‌లో ఉరి వేసుకుని మోడ‌ల్ ఆత్మ‌హ‌త్య‌.. సూసైడ్ నోట్‌లో ఏముందంటే..?

ముంబైలోని అంధేరీ ప్రాంతంలోని ఓ హోటల్ గదిలో 30 ఏళ్ల మోడల్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది.

పోలీసులు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. మోడల్ బుధవారం రాత్రి 8 గంటల సమయంలో హోటల్‌లో చెక్ ఇన్ అయ్యింది. అనంత‌రం డిన్నర్ కూడా ఆర్డర్ చేసింది. అయితే.. గురువారం హౌస్ కీపింగ్ సిబ్బంది పలుమార్లు గ‌ది త‌లుపు త‌ట్టినా, ఫోన్ చేసినా ఆమె తలుపు తీయలేదు. అనుమానం వ‌చ్చిన హౌస్ కీపింగ్ సిబ్బంది విష‌యాన్ని హోట‌ల్ మేనేజ‌ర్‌కు తెలియ‌జేశారు.

దీంతో హోటల్ మేనేజర్ పోలీసులకు సమాచారం అందించారు. హోటల్‌కు చేరుకున్న పోలీసులు మాస్టర్‌ కీతో గదిని తెరిచి చూడగా మోడల్‌ మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఘటనా స్థలం నుంచి సూసైడ్ నోట్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. "నన్ను క్షమించండి. దీనికి ఎవరూ బాధ్యులు కాదు. నేను సంతోషంగా లేను. నాకు శాంతి కావాలి."అని సూసైడ్ నోట్‌పై రాసి ఉంది.

అనుమానాస్ప‌ద మృతి కింద వెర్సోవా పోలీసులు కేసు న‌మోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి తరలించారు. ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Next Story