కృష్ణా జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా ఎమ్మెల్యే ఇంట్లో పడి పెద్దమొత్తంలో నగదును దోచేశారు. వివరాళ్లోకెళితే.. పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ఇంట్లో దోపిడి దొంగలు చొరబడి.. రూ.18 లక్షలు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు.. ఎమ్మెల్యే ఇంటిని పరిశీలించారు.
క్లూస్ టీమ్ సహకారంతో ఆధారాలు సేకరించారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో దొంగతనం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి ఇంటి ఆవరణలో చుట్టు పక్కల ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ఎమ్మెల్యే ఇంట్లోనే చోరీ జరగడంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. దొంగల కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలు పెట్టారు.