17 సంవత్సరాల బాలిక.. 50,000 రూపాయలకు బేరం

Minor girl sold for Rs 50,000. మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లాలో 17 ఏళ్ల బాలికను రూ. 50,000కు ఒక వ్యక్తికి విక్రయించినందుకు

By M.S.R  Published on  7 May 2023 8:00 PM IST
17 సంవత్సరాల బాలిక.. 50,000 రూపాయలకు బేరం

మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లాలో 17 ఏళ్ల బాలికను రూ. 50,000కు ఒక వ్యక్తికి విక్రయించినందుకు ముగ్గురు పురుషులు, ఒక మహిళను పోలీసులు అరెస్టు చేసినట్లు ఆదివారం ఒక అధికారి తెలిపారు. మాండ్లా జిల్లాలోని ఘుఘ్రి పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న బాలిక, జబల్‌పూర్‌లోని ఒక డెయిరీలో పనిచేస్తోంది. ఆ సమయంలో కొందరు ఆ అమ్మాయికి పరిచయం అయ్యారు. నిందితులలో ఇద్దరు పహల్‌వతి బాయి, సునీల్ కుష్వాహాను కలిశారని అదనపు పోలీసు సూపరింటెండెంట్ అమృత్ మీనా తెలిపారు. ముంబైలో మంచి ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఇద్దరు నిందితులు ఆమెకు మాయమాటలు చెప్పారు.

నిందితులు రైసెన్‌లోని పటాయ్ గ్రామానికి చేరుకున్నారు, అక్కడ వారు అమ్మాయిని రూ. 50,000 కు విష్ణు కుష్వాహ అనే వ్యక్తికి వివాహం చేసుకోవడానికి విక్రయించినట్లు అధికారి తెలిపారు. ఈలోగా బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మానవ అక్రమ రవాణా కేసులో ప్రమేయం ఉన్న నలుగురు నిందితులను పోలీసులు శనివారం అరెస్టు చేసినట్లు అధికారి తెలిపారు. మండల పోలీసులు అందించిన సమాచారం మేరకు నిందితులను పాతాయి గ్రామం నుంచి అరెస్టు చేసినట్లు డియోరీ పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ శ్రద్ధా ఉయికే తెలిపారు. బాలికను పోలీసులకు అప్పగించారు.


Next Story