మైన‌ర్ బాలిక‌ను కిడ్నాప్ చేసి అత్యాచారం

Minor Girl molested in Meerpet.మైన‌ర్ బాలిక‌ను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Nov 2022 10:56 AM IST
మైన‌ర్ బాలిక‌ను కిడ్నాప్ చేసి అత్యాచారం

ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు ఉన్న‌ప్ప‌టికీ మ‌హిళ‌ల‌పై దారుణాలు ఆగ‌డం లేదు. ఆడ‌పిల్ల ఒంటరిగా క‌నిపిస్తే చాలు ప‌శువుల్లా మీద ప‌డి త‌మ కామవాంఛ తీర్చుకుంటున్నారు మాన‌వ మృగాలు. మైన‌ర్ బాలిక‌ను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ దారుణ ఘ‌ట‌న హైద‌రాబాద్ న‌గ‌రంలో జ‌రిగింది.

మీర్‌పేట పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని లెనిన్ న‌గ‌రంలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. తొమ్మిదో త‌ర‌గ‌తి చ‌దువుతున్న బాలిక రాత్రి స‌మ‌యంలో స్నేహితురాలిని క‌లిసేందుకు వెళ్లింది. బాలికపై కొంత కాలంగా క‌న్నేసిన కామాంధులు ఇదే అదునుగా బావించి బాలిక‌ను కిడ్నాప్ చేశారు. బైక్‌పై ఎక్కించుకుని బ‌డంగ్‌పేట్‌లోని ప్ర‌భుత్వ పాఠ‌శాల వెన‌క‌కు తీసుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు.

బాలిక కేక‌లు వేయ‌డంతో స్థానికులు అక్క‌డ‌కు చేరుకున్నారు. స్థానికుల రాక‌ను గ‌మ‌నించిన నిందితులు అక్కడ నుంచి ప‌రారు అయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story