మైనర్ బాలిక దారుణ హత్య.. మృతదేహాన్ని ముక్కలుగా నరికి.. ప్లాస్టిక్‌ సంచుల్లో నింపి..

ఉదయపూర్‌లో ఒక వ్యక్తి తొమ్మిదేళ్ల బాలికను అతి క్రూరంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని అనేక ముక్కలుగా నరికి

By అంజి  Published on  3 April 2023 1:33 AM GMT
Rajasthan, Udaipur, Crime news

మైనర్ బాలిక దారుణ హత్య.. మృతదేహాన్ని ముక్కలుగా నరికి.. ప్లాస్టిక్‌ సంచుల్లో నింపి..

దేశంలో మహిళలు, బాలికలపై నేరాల పరంపర ఆగడం లేదు. తాజాగా రాజస్థాన్‌లో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. ఉదయపూర్‌లో ఒక వ్యక్తి తొమ్మిదేళ్ల బాలికను అతి క్రూరంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని అనేక ముక్కలుగా నరికి ప్లాస్టిక్ సంచుల్లో నింపాడు. ఈ కేసుకు సంబంధించి నిందితుడిని కమలేష్ (20)గా గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్ఆరు. అతడిని స్కూల్ డ్రాపవుట్‌గా గుర్తించారు. అయితే హత్యకు ముందు తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగినట్లు ఇంకా రుజువు కాలేదని పోలీసులు తెలిపారు. ఈ కేసు తదుపరి విచారణ కొనసాగుతోంది.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాలిక మార్చి 29 నుండి కనిపించకుండా పోయింది. ఆమె శరీర భాగాలు శనివారం రాత్రి మావ్లీ ప్రాంతంలోని పాడుబడిన ఇంట్లో కనుగొనబడ్డాయి. పాడుబడిన ఇంటి నుంచి దుర్వాసన వస్తోందని స్థానికులు కొందరు ఫిర్యాదు చేయడంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు అదే పరిసరాల్లో నివసిస్తోంది. నిందితుడు బాధితురాలి ఇంటికి సమీపంలోనే ఉంటున్నాడని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వికాస్ శర్మ తెలిపారు.

Next Story