మైనర్ బాలికను కిడ్నాప్ చేసి పదేపదే అత్యాచారం.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

Minor girl kidnapped and sexually assaulted in Madhya Pradesh. మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. హత్వా అటవీ ప్రాంతంలో రెండు రోజులుగా కిడ్నాప్

By అంజి  Published on  15 Feb 2022 6:40 PM IST
మైనర్ బాలికను కిడ్నాప్ చేసి పదేపదే అత్యాచారం.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. హత్వా అటవీ ప్రాంతంలో రెండు రోజులుగా కిడ్నాప్ చేయబడి, పలుమార్లు అత్యాచారానికి గురైన మైనర్ బాలిక సోమవారం రోజున జిల్లా ఆసుపత్రిలో మరణించింది. బాధితురాలు ఫిబ్రవరి 11న జిల్లా రేవాలోని తన అత్త నివాసం వెలుపల నుండి కిడ్నాప్ చేయబడింది. మైనర్ బాలిక వాంగ్మూలం ప్రకారం.. నిందితుడి సహచరులలో ఒకరు ఆమెను సిద్ధి జిల్లా ఆసుపత్రిలో పడవేసే ముందు ఆమెపై అత్యాచారం చేసిన వ్యక్తి బలవంతంగా విషం తినిపించాడు. రేవా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎలాంటి రిజిస్ట్రేషన్ నంబర్ లేని జీపులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు తన మేనకోడలిని కిడ్నాప్ చేశారని బాధితురాలి అత్త ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 11న హనుమన్న పోలీస్ స్టేషన్‌లో కిడ్నాప్ కేసు నమోదైంది. జిల్లా సిద్ధి నివాసి అయిన బాధితురాలు కిడ్నాప్‌కు గురైన రోజు జిల్లా రేవాలోని తన అత్త ఇంటికి వచ్చింది.

కిడ్నాపర్‌ల ఆధారాల కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్న సమయంలో అనిల్ తివారీ అనే వ్యక్తి బాధితురాలిని ఫిబ్రవరి 13 అర్థరాత్రి జిల్లా ఆసుపత్రి గేట్ల వద్ద పడేశాడు. బెహ్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని హత్వా గ్రామానికి చెందిన జీవేంద్ర సింగ్, అభిరాజ్ యాదవ్ తనను కిడ్నాప్ చేశారని, రెండు రోజుల పాటు జీవేంద్ర సింగ్ తనపై పదేపదే అత్యాచారం చేశారని బాధితురాలు తన వాంగ్మూలంలో వెల్లడించింది. ఈ ప్రకటనను ఇప్పుడు పోలీసులు డైయింగ్ డిక్లరేషన్‌గా పరిగణిస్తున్నారు. పోలీసులను ఆశ్రయిస్తానని బెదిరించడంతో ఆమెకు బలవంతంగా విషం తినిపించారని కూడా పేర్కొంది.

సీద్దీ జిల్లా ఆసుపత్రిలో బాధితురాలు మరణించిన ఇరవై గంటల తర్వాత, ప్రధాన నిందితుడు జీవేంద్ర సింగ్ కూడా విషం సేవించాడు. జిల్లా ఆసుపత్రికి చేరుకునేలోగా మరణించినట్లు ప్రకటించారు. సిధి జిల్లా అదనపు పోలీసు సూపరింటెండెంట్ అంజు లతా పటేల్ మాట్లాడుతూ.. ప్రధాన నిందితుడు కూడా విషం సేవించి మరణించాడని ధృవీకరిస్తూ, ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని చెప్పారు. "జిల్లా రేవాలో కిడ్నాప్ కేసు నమోదైందని, వైద్యులు ఇంకా పోస్ట్ మోర్టమ్ నివేదికను సమర్పించలేదు. వైద్యుల నుంచి నివేదిక అందిన తర్వాత తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం'' అని పటేల్ చెప్పారు. ప్రస్తుతం చనిపోయిన ప్రధాన నిందితుడు జీవేంద్ర సింగ్ వివాహితుడు, ఇద్దరు పిల్లల తండ్రి అని పోలీసులు తెలిపారు.

Next Story