వాష్‌రూమ్‌ నుంచి బయటకు రాలేదని.. కూతురిని కొట్టి చంపిన తండ్రి

Minor girl beaten to death by father in Hyderabad.. accused arrested. హైదరాబాద్‌ మహా నగరంలోని సైఫాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మూడేళ్ల బాలికను తన తండ్రి దారుణంగా

By అంజి  Published on  10 Aug 2022 11:07 AM IST
వాష్‌రూమ్‌ నుంచి బయటకు రాలేదని.. కూతురిని కొట్టి చంపిన తండ్రి

హైదరాబాద్‌ మహా నగరంలోని సైఫాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మూడేళ్ల బాలికను తన తండ్రి దారుణంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడిన చిన్నారి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. తండ్రి బసిత్‌ ఖాన్‌పై హత్యాయత్నం అభియోగాన్ని హత్యగా మారుస్తామని సైఫాబాద్‌ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. వివరాల్లోకి వెళ్తే.. శనివారం నాడు ఏసీ గార్డ్స్‌లోని తన ఇంట్లో చిన్నారి ఆడుకుంటోంది. ఈ క్రమంలోనే తండ్రి.. అక్కడి నుంచి బయటకు వచ్చి ఆడుకోవాలంటూ బాలికకు చెప్పాడు.

అయితే చిన్నారి తండ్రి చెప్పిన మాటలను పట్టించుకోలేదు. చాలా సేపటి వరకు బయటకు రాలేదు. దీంతో ఆగ్రహించిన తండ్రి బాలికను నిర్దాక్షిణ్యంగా కొట్టాడు. గర్భవతి అయిన తల్లి మధ్యలో జోక్యం చేసుకుని భర్తను ఆపేందుకు ప్రయత్నించింది. దీంతో అతడు తన భార్యను దూరంగా నెట్టడంతో.. ఆమె కిందపడిపోయింది. ఆ తర్వాత బాలికను గరిటతో కొట్టాడు. ఆపై చిన్నారిని పట్టుకుని నేలపై పడేశాడు. కూతురిని కొట్టిన తర్వాత తండ్రి బసిత్‌ ఖాన్‌ అక్కడి నుంచి వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు.

బాలిక నోటి నుంచి నురుగు రావడంతో బాలిక తల్లి ఆమెను నీలోఫర్‌ ఆస్పత్రికి తరలించింది. భార్య బాసిత్‌ను పిలిచిన తర్వాత అతడు ఆస్పత్రికి వచ్చాడని పోలీసులు తెలిపారు. ఈ దంపతులకు నలుగురు కుమార్తెలు. వీరికి 2015లో వివాహం అయ్యింది. వారు తమ ఐదవ బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు. మృతురాలు వారి మూడవ సంతానం. తల్లి ఫిర్యాదు ఆధారంగా, భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి), జువైనల్ జస్టిస్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులుతెలిపారు.

Next Story