విజయవాడలో మరో దారుణం.. 11 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. మేనమామపై అనుమానం.!

Minor found dead in Vijayawada, police suspect murder by uncle. ఫిబ్రవరి 9, బుధవారం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలోని కీసర గ్రామ సమీపంలోని సుబాబుల్ పొలాల్లో 11 ఏళ్ల బాలిక అనుమానాస్పద

By అంజి  Published on  11 Feb 2022 6:59 AM GMT
విజయవాడలో మరో దారుణం.. 11 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. మేనమామపై అనుమానం.!

ఫిబ్రవరి 9, బుధవారం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలోని కీసర గ్రామ సమీపంలోని సుబాబుల్ పొలాల్లో 11 ఏళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటన కంచికచెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తల్లిదండ్రులకు చెబుతారనే భయంతోనే మేనమామ ఆమెను హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. బాలిక అదే గ్రామంలో నివసిస్తుందని నివేదికలు చెబుతున్నాయి. మంగళవారం రాత్రి ఈ ఘటన జరగ్గా, బుధవారం ఉదయం మృతదేహాన్ని గుర్తించినట్లు నందిగామ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) జి నాగేశ్వర రెడ్డి తెలిపారు.

దుస్తులు లేకుండా అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలికను గ్రామస్థులు గమనించి తహశీల్దార్‌, పోలీసులకు సమాచారం అందించారు. కంచికచెర్ల పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనా స్థలం నుంచి ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మైలవరం వెళ్లాల్సి రావడంతో తల్లిదండ్రులు తమ కుమార్తెను సోమవారం కీసరలో తాతయ్యల వద్ద వదిలి వెళ్లారు. బాలిక మేనమామ పి.సైదులు సోమవారం వచ్చి స్క్రాప్ సేకరిస్తాననే నెపంతో తీసుకెళ్లినట్లు అమ్మమ్మ పోలీసులకు తెలిపింది. అతను బాలికను పొలంలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి పొట్టనబెట్టుకున్నాడని అమ్మమ్మ ఆరోపించింది. మృతికి గల కారణాలను తెలుసుకుంటున్నామని డీఎస్పీ తెలిపారు. హత్యకు ముందు బాలికను లైంగికంగా వేధించారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నట్లు డీఎస్పీ తెలిపారు.

Next Story
Share it