12 ఏళ్ల బాలికపై అత్యాచారం.. రక్తపు మడుగులో సహాయం కోసం కేకలు.. వీడియో
Men make videos as injured minor cries for help in UttarPradesh. యూపీలో దారుణ ఘటన వెలుగు చూసింది. కన్నౌజ్‌లోని డాక్ బంగ్లా అతిథి గృహం వెనుక 12 ఏళ్ల బాలిక రక్తంలో తడిసిపోయి క
By అంజి Published on 25 Oct 2022 6:16 AM GMTయూపీలో దారుణ ఘటన వెలుగు చూసింది. కన్నౌజ్‌లోని డాక్ బంగ్లా అతిథి గృహం వెనుక 12 ఏళ్ల బాలిక రక్తంలో తడిసిపోయి కనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో.. చుట్టుపక్కలవారు తీవ్రంగా గాయపడిన అమ్మాయికి సహాయం చేయడానికి బదులుగా ఫోన్‌లో వీడియో చిత్రీకరణతో బిజీగా ఉండటం చూడొచ్చు. బాలిక తలపై సహా పలు గాయాలయ్యాయి.
వీడియోలో.. అమ్మాయి తన చేతిని పైకెత్తి సహాయం కోసం ప్రయత్నిస్తున్నట్లు చూడవచ్చు. కానీ ఆమె చేసిన వేడుకోలుకు అక్కడున్న వారి నుంచి ఎలాంటి సమాధానం లేదు. ఈ వీడియోలో కొంతమంది పురుషులు తమ మొబైల్ ఫోన్‌లను చేతిలో పట్టుకుని, ఆమెను వివిధ కోణాల్లో చిత్రీకరిస్తున్నారు. పోలీసులకు సమాచారం అందించారా అని అక్కడున్న కొందరు అడుగుతున్నారు. మరొకరు పోలీసు చీఫ్ నంబర్ అడిగారు. కానీ అమ్మాయికి సహాయం చేయడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా చిత్రీకరణ కొనసాగింది.
పోలీసులు వచ్చే వరకు బాలిక సహాయం కోసం వేచి ఉండాల్సి వచ్చింది. వైరల్ అయిన రెండవ వీడియో.. స్థానిక పోలీసు అవుట్‌పోస్ట్ ఇన్‌చార్జి గాయపడిన అమ్మాయిని తన చేతుల్లో పట్టుకుని ఆటోరిక్షా వైపు వెళ్తున్నట్లు కనిపించింది. పోలీసు సూపరింటెండెంట్ కున్వర్ అనుపమ్ సింగ్ మాట్లాడుతూ.. "మైనర్ బాలిక గాయపడినట్లు గుర్తించబడింది. స్థానిక పోలీసులు ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు." బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
బాలిక లైంగిక వేధింపులకు గురైందా లేదా అన్నది స్పష్టంగా తెలియరాలేదు. ఈ కేసులో ఇంకా అరెస్టులు జరగలేదు. బాలిక కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె మధ్యాహ్నం పిగ్గీ బ్యాంక్ కొనేందుకు బయటకు వెళ్లింది. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆమె కోసం గాలిస్తున్నారు. గెస్ట్ హౌస్ వెనుక బాలిక రక్తంతో తడిసిపోయి, గాయపడింది. బాధితురాలిని తరువాత జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ వైద్యుడు ఆమెను పరీక్షించి, ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో కాన్పూర్‌కు రెఫర్ చేశారు.
బాలికపై సామూహిక అత్యాచారం చేసి అక్కడే పడేసినట్లు స్థానికులు ఆరోపించారు. అయితే, స్థానికుల వాదనను పోలీసులు కొట్టిపారేస్తున్నారు. గుర్సహైగంజ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ మనోజ్ పాండే మాట్లాడుతూ.. బాలిక స్టేట్‌మెంట్ ఇవ్వడానికి పోలీసులు వేచి ఉన్నారని చెప్పారు.
कन्नौज में खून से लथपथ एक मासूम बच्ची सड़क किनारे तड़पती रही लेकिन लोग तमाशबीन बने वीडियो बनाने में जुटे रहे।
— UP Congress (@INCUttarPradesh) October 24, 2022
ऐसे में एक पुलिसकर्मी द्वारा उसे गोद में उठाकर अस्पताल ले जाया गया। पुलिसकर्मी का कृत्य प्रशंसनीय है।
लेकिन, सवाल कि इस मासूम का गुनहगार कौन है? और कब पकड़ा जाएगा? pic.twitter.com/CnW9YeQrsu