బెంగళూరు శివార్లలోని చందాపూర్‌లో డెంటిస్ట్రీ విద్యార్థిని యశస్విని (23) ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి. కాలేజ్‌లో లెక్చరర్లు తన చర్మం రంగు, వేషధారణ విషయంలో అవమానించినందుకు బాధపడి ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ (ఓఎంఆర్) విభాగానికి చెందిన ఆరుగురు లెక్చరర్లను కాలేజీ యాజమాన్యం తొలగించింది.
క్లాస్‌లో యశస్విని బహిరంగంగా అవహేళన చేశారని కుటుంబ సభ్యులు, సహవిద్యార్థులు ఆరోపిస్తున్నారు. ముదురు రంగులో ఉన్న అమ్మాయి డాక్టర్ ఎలా అవుతుంది? అని అవమానించారని వారు చెబుతున్నారు. ఒకరోజు ఆమె కంటి నొప్పి కారణంగా సెలవు తీసుకోగా.., ఆమెను సెమినార్‌లను ప్రదర్శించకుండా, రేడియాలజీ కేసులను నిర్వహించకుండా నిరోధించండంతోపాటు దుర్భాషలాడారని ఆరోపిస్తున్నారు.