మొబైల్ గేమింగ్ యాప్ ద్వారా మోసం చేశారన్న ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోల్‌కతాలోని ఆరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ ప్రాంతంలోని వ్యాపారవేత్త అమీర్ ఖాన్ నివాసాలపై బ్యాంకు అధికారులతో కలిసి ఈడీ అధికారుల బృందం శనివారం దాడులు నిర్వహించి రూ.7 కోట్ల నగదు, ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. రికవరీ చేయబడిన నగదు ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి నగదు లెక్కింపు యంత్రాలను తెప్పించారు.
ఈడీ అధికారులు, బ్యాంకు అధికారులు కలిసి కోల్‌కతా, గార్డెన్ రీచ్ ఏరియాలోని వ్యాపారవేత్తకు సంబంధించిన ఆరు చోట్ల సోదాలు చేశారు. రూ.7 కోట్ల మేరకు నగదును, ఆస్తి దస్తావేజులను స్వాధీనం చేసుకున్నారు. ఈడీ సోదాలు సజావుగా జరగడం కోసం ఖాన్ ఇంటి వద్ద కేంద్ర బలగాలను మోహరించారు. మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నట్లు అనుమానాలు ఉండడంతో ఈడీ సోదాలు చేస్తోంది.
ఈడీ సోదాలు జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో కేంద్ర బలగాలను మోహరించారు. E-Nuggets అనే మొబైల్ గేమింగ్ యాప్ వినియోగదారులను మోసం చేసినందుకు నిందితుడు అమీర్ ఖాన్, ఇతరులపై ఫెడరల్ బ్యాంక్ అధికారులు చేసిన ఫిర్యాదు మేరకు మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద కేసు నమోదు చేయబడింది. మొదట్లో ఎక్కువ కమీషన్స్ ఇచ్చి ఆ తర్వాత బడా మోసానికి పాల్పడినట్లు తెలుస్తోంది.