దారుణం.. ప్రియుడి చేతిలో హత్యకు గురైన వివాహిత

Married woman killed by lover in Jharkhand. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్‌లో శనివారం రాత్రి వివాహితను ఆమె ప్రియుడు హత్య చేశాడు.

By అంజి
Published on : 16 Jan 2023 1:45 PM IST

దారుణం.. ప్రియుడి చేతిలో హత్యకు గురైన వివాహిత

జార్ఖండ్‌లోని రామ్‌గఢ్‌లో శనివారం రాత్రి వివాహితను ఆమె ప్రియుడు హత్య చేశాడు. బాధితురాలు, రంజన్ కసెరా భార్య మమతా దేవి, నిందితుడు అర్మాన్ ఖాన్‌తో ప్రేమలో ఉంది. కొడవలితో హత్యకు గురైన మమతా దేవి రామ్‌గఢ్ జిల్లాలోని బర్కకానా ఓపీ ప్రాంతంలోని భద్వాతండ్‌లో అద్దెకు నివసిస్తోంది. మమత సోదరి జయ దేవి తెలిపిన వివరాల ప్రకారం మృతురాలు రంజన్ కసెరా అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే గత ఏడాది కాలంగా హజారీబాగ్ నివాసి అర్మాన్ ఖాన్ అలియాస్ రాకీ బాబా మమతతో ఫోన్‌లో మాట్లాడేవాడు.

ఈ నెలలో అర్మాన్ మమత అద్దెకు తీసుకున్న ఇంటికి వచ్చినప్పుడు, కుటుంబ సభ్యులందరూ ఢిల్లీలో ఉన్నారని జయ దేవి చెప్పారు. జనవరి 14న జయ దేవి తన భర్తతో కలిసి రామ్‌గఢ్ పట్టణానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి రక్తపు మడుగులో తన సోదరి మృతి చెందినట్లు గుర్తించారు. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. రామ్‌గఢ్ ఎస్పీ పీయూష్ పాండే మాట్లాడుతూ.. ఇద్దరూ అంగీకారంతో సంబంధం కలిగి ఉన్నట్లు ప్రాథమికంగా కనిపించిందని, జనవరి 14న, మాటల తూటాల కారణంగా ఆవేశంతో మమతను అర్మాన్ హతమార్చాడు.

హత్యకు గల ఖచ్చితమైన ట్రిగ్గర్ ఇంకా తెలియరాలేదు. అర్మాన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు మరియు తదుపరి విచారణ కొనసాగుతోంది.

Next Story