ఆత్మహత్య చేసుకున్న వివాహిత‌.. పరారీలో అత్తామామ

Married woman Committed for Suicide. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. నందిని అనే వివాహిత గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని

By M.S.R  Published on  8 April 2023 11:45 AM IST
ఆత్మహత్య చేసుకున్న వివాహిత‌.. పరారీలో అత్తామామ

Married woman Committed for Suicide


రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. నందిని అనే వివాహిత గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామల వేధింపులు భరించలేక ఆమె చనిపోయిందని ఆరోపణలు వచ్చాయి. తమ బిడ్డను చిత్ర హింసలు పెట్టి భర్త, అత్తమామలు హత్య చేసి… ఆత్మహత్యగా చిత్రీకరించారని నందినీ తల్లిదండ్రులు వాపోయారు. తమ కుమార్తె శరీరంపై గాయాలు ఉన్నాయని, అతి దారుణంగా తమ బిడ్డను కొట్టి చంపేశారని వారు కన్నీరుమున్నీరయ్యారు. నందినీ చనిపోయిన విషయాన్ని ఆమె భర్త రత్నదీప్ కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. వచ్చి శవాన్ని తీసుకొని వెళ్లండని రత్నదీప్ ఫోన్ చేశాడని వారు తెలిపారు. హైదరాబాద్‌కు వచ్చిన ఆమె తల్లిదండ్రులు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నందినీ స్వస్థలం కర్ణాటకలోని బీదర్ జిల్లా. 304 బి సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నందినీ భర్త రత్నదీప్‌ను అరెస్ట్ చేశారు. అత్త మామ విజయ, లక్ష్మణ్‌రావులు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


Next Story