ప‌దో అంతస్థుపై నుంచి దూకి మహిళ ఆత్మహత్య

Married Woman Commits For Suicide. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్ప‌డింది.

By Medi Samrat
Published on : 22 Feb 2021 11:17 AM IST

Married Woman Commits For Suicide

కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్ప‌డింది. శ్రీనివాస్ నగర్ కాలనీకి స‌మీపంలోని నాగారంలో ప్రభుత్వం నిర్మిస్తున్న‌ డబుల్ బెడ్ రూమ్ ఇంటిపై నుండి దూకి మ‌హిళ‌ ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే సంఘటనా స్థలానికి చేరుకుని.. మృత‌దేహాన్ని స్వాధీన‌ప‌ర్చుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

వివ‌రాళ్లోకెళితే.. పవన్ భగవాన్, సత్య సంతోషిణి (27) తుక్కుగుడా ప్రాంతానికి చెందినవారు. వీరిరువురికి వివాహం జ‌రిగి మూడేళ్లు అయ్యింది. అయితే.. సంతానం కలగకపోవటంతో భార్య భర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఆ గొడ‌వే సత్య సంతోషిణి ఆత్మహత్యకు కార‌ణం అయ్యుండొచ్చ‌ని పోలీసులు బావిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాల విషయంలో పలు కోణాల్లో దర్యాప్తు చేస్తామని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభినట్లు సీఐ నరేందర్ పేర్కొన్నారు.


Next Story