తనతో పెళ్లికి నిరాకరించిందని ఓ యువతిపై కక్ష పెంచుకున్న యువకుడు.. యువతిని దారుణంగా హతమార్చాడు. ఆ యువతి తల నరికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. విజయనగర జిల్లాలో కూడ్లిగి తాలూకా కన్నిబొరయ్యహట్టికి చెందిన భోజరాజు అనే యువకుడు ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. తన సమీప బంధువైన బసణ్ణ కుమార్తె నిర్మల (21) ను ప్రేమిస్తున్నాను అంటూ వెంటపడేవాడు. నిర్మల బీఎస్సీ నర్సింగ్ చదువుతోంది. ఓ సారి వారి ఇంటికి వెళ్లి నిర్మలను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అందుకు ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. తమ కూతురు బీఎస్సీ నర్సింగ్ పూర్తయ్యాక ఉద్యోగం చేస్తుందని.. ఆమెకు మంచి ఉద్యోగం ఉన్న అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్పారు. దీంతో నిర్మలపై కక్ష పెంచుకున్నాడు.
రెండు నెలల క్రితం భోజరాజుకు మరో యువతితో వివాహమైంది. వేరే జిల్లాలో చదువుతున్న నిర్మల ఇటీవల ఇంటికి వచ్చింది. గురువారం మధ్యాహ్నాం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిర్మల ఇంటికి వెళ్లాడు భోజరాజు. అక్కడ నిర్మలతో గొడవ పడ్డాడు. తన వెంట తెచ్చుకున్న కొడవలితో ఆమె తల నరికి హత్య చేశాడు. అనంతరం తలను సంచిలో వేసుకుని బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు బోజరాజును అరెస్టు చేసి, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 302 (హత్య), 450 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.