ములుగు జిల్లాలో రెచ్చిపోయిన‌ మావోయిస్టులు

పోలీసుల ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరు వ్యక్తులను మావోయిస్టులు దారుణంగా హత్య చేసిన ఘటన ములుగు జిల్లాలో జరిగింది.

By Kalasani Durgapraveen  Published on  22 Nov 2024 10:39 AM IST
ములుగు జిల్లాలో రెచ్చిపోయిన‌ మావోయిస్టులు

పోలీసు ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరు వ్యక్తులను మావోయిస్టులు దారుణంగా హత్య చేసిన ఘటన ములుగు జిల్లాలో జరిగింది. వీరిద్దరి హత్య నేపథ్యంలో మళ్లీ ఏజెన్సీలో మరోసారి అలజడి నెలకొంది.

ములుగు జిల్లా వాజేడులో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఇద్దరు వ్యక్తులను మావోయిస్టులు దారుణంగా చంపారు. ఈ సందర్భంగా మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఈ లేఖలో.. మృతులను పలుమార్లు హెచ్చరించినా వారు తీరు మార్చుకోలేదంటూ పేర్కొన్నారు.

మృతిచెందిన వారిని ఉయిక రమేష్, ఉయిక అర్జున్ గా పోలీసులు గుర్తించారు. పేరూరు పంచాయతీ కార్యదర్శిగా రమేష్ పనిచేస్తున్నారు. వీరిద్దరి హత్య తో ఏజెన్సీలోని.. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ దారుణ హత్యకు సంబంధించి సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story