మైన‌ర్ బాలిక‌పై అత్యాచారం.. నిందితుడి దారుణ హ‌త్య‌.. న‌దిలో శ‌రీర భాగాలు

Man Who assaulted Minor Killed By Her Father in Khandwa.మైన‌ర్ బాలిక‌పై అత్యాచారం.. నిందితుడి దారుణ హ‌త్య‌.. న‌దిలో శ‌రీర భాగాలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 March 2022 4:33 AM GMT
మైన‌ర్ బాలిక‌పై అత్యాచారం.. నిందితుడి దారుణ హ‌త్య‌.. న‌దిలో శ‌రీర భాగాలు

ఓ వ్య‌క్తిని దారుణంగా హత్య చేశారు. మృత‌దేహాన్ని ముక్కలుగా క‌ట్ చేసి న‌దిలో ప‌డేశారు. శ‌రీర భాగాలు న‌దిలో తేలుతుండ‌గా.. గ‌మ‌నించిన స్థానికులు పోలీసులకు స‌మాచారం అందించారు. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టగా.. హ‌త్య వెనుక పాశ‌విక కోణం వెలుగు చూసింది. మైన‌ర్ బాలిక పై మృతుడు అత్యాచారానికి పాల్ప‌డడంతో.. ఆగ్ర‌హించిన బాలిక తండ్రి, మేన‌మామ అత‌డిని హ‌త మార్చిన‌ట్లు తెలిపారు. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ఖాండ్వా జిల్లాలో జ‌రిగింది.

ఘ‌ట‌న ఎలా వెలుగులోకి వ‌చ్చిందంటే.. ఆదివారం నాడు ఖాండ్వా జిల్లా కేంద్రానికి 40 కిలోమీట‌ర్ల దూరంలోని అజ్నాల్ న‌దిలో ఓ వ్య‌క్తి శ‌రీర భాగాలు న‌దిలో తేలుతూ క‌నిపించాయి. వీటిని ఫోటోలు, వీడియోలు తీసిన కొంద‌రు సోష‌ల్ మీడియాలో పోస్టు చేయ‌గా.. వైర‌ల్‌గా మారాయి. రంగంలోకి దిగిన పోలీసులు న‌దిలోంచి శ‌రీర భాగాలు సేక‌రించి విచార‌ణ చేప‌ట్టారు. మృతుడి వివ‌రాల గురించి ఆరా తీశారు. చివ‌రికి అత‌డిని సక్తాపూర్ గ్రామానికి చెందిన 55 ఏళ్ల త్రిలోక్‌చంద్ గా గుర్తించారు.

త్రిలోక్‌చంద్ 14 ఏళ్ల మైనర్ బాలిక‌పై అత్యాచారానికి పాల్ప‌డిన‌ట్లు విచార‌ణ‌లో తేలింది. ఆ బాలిక తండ్రి, మేన‌మామ‌.. త్రిలోక్ చంద్‌ను బైక్‌పై అజ్నాల్ న‌ది వ‌ద్ద‌కు తీసుకువెళ్లారు. అక్క‌డ అత‌డి త‌ల న‌రికారు. అనంత‌రం చేప‌ల‌ను కోసేందుకు వినియోగించే సాధ‌నంలో మొండెంను రెండు భాగాలుగా చేశారు. ఆ త‌రువాత ఆ శ‌రీర భాగాల‌ను న‌దిలోకి ప‌డేశార‌ని సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ రాకేష్ పెండ్రో చెప్పారు. నిందితుల‌ను అరెస్ట్ చేశామ‌ని, ఇంకా ఏవ‌రి ప్రమేయం అయినా ఉందా..? అన్న కోణంలోనూ ద‌ర్యాప్తు చేప‌ట్టినట్లు వివ‌రించారు.

Next Story
Share it