'నా భార్యను చంపేశా.. శవం దగ్గరకు తీసుకెళ్తా.. పదండి'.. పోలీస్‌స్టేషన్‌లో భర్త

Man walks to police after killing wife in Ghaziabad. ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఘజియాబాద్‌లోని ట్రోనికా సిటీ ప్రాంతంలో గురువారం ఓ వ్యక్తి తన

By అంజి  Published on  11 Nov 2022 1:57 PM IST
నా భార్యను చంపేశా.. శవం దగ్గరకు తీసుకెళ్తా.. పదండి.. పోలీస్‌స్టేషన్‌లో భర్త

ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఘజియాబాద్‌లోని ట్రోనికా సిటీ ప్రాంతంలో గురువారం ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి మృతదేహాన్ని పొదల్లోకి విసిరాడు. అనంతరం ఎస్‌ఎస్పీ కార్యాలయానికి వెళ్లి నేరం అంగీకరించాడు. నిందితుడు తన భార్య మృతదేహాన్ని ఎక్కడ పారేశాడో పోలీసులకు సమాచారం అందించాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించారు. ఓ వ్యక్తి సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయానికి వెళ్లి.. అతను తన 28 ఏళ్ల భార్యను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ఘజియాబాద్‌లోని ట్రోనికా సిటీ ప్రాంతంలో విసిరినట్లు పోలీసులకు చెప్పాడు.

''నా భార్యను చంపేశాను, శవం దగ్గరకు తీసుకుని వెళ్తా.. పదండి'' అని నిందితుడు పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు తెలిపిన మేరకు ఘటనాస్థలికి చేరుకున్న బృందం మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంది. సద్దాం అనే నిందితుడు తన భార్యపై అనుమానం పెంచుకునేవాడని సమాచారం. గురువారం సద్దాం తన భార్యను నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి బరువైన వస్తువుతో హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని ట్రోనికా సిటీ ప్రాంతంలోని పొదల్లోకి విసిరేశాడు.

నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు

భార్యను హత్య చేసిన తర్వాత సద్దాం ఎస్‌ఎస్పీ కార్యాలయానికి చేరుకుని నేరాన్ని అంగీకరించాడు. ఎస్పీ దేహత్‌కు చెందిన ఇరాజ్ రాజా ప్రకారం, మృతురాలి వయస్సు సుమారు 28 సంవత్సరాలు. ఈ హత్యలో మరెవ్వరి ప్రమేయమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story