శృంగారానికి నిరాకరించిందని.. భార్యను తగలబెట్టిన భర్త

ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో దారుణం జరిగింది. శృంగారం విషయంలో భార్యతో వాగ్వాదం పెట్టుకున్న భర్త.. ఆ తర్వాత భార్యకు నిప్పంటించాడు.

By అంజి
Published on : 1 Jun 2025 9:43 AM IST

Man tries to set wife ablaze, arrest, Crime, Mumbai

శృంగారానికి నిరాకరించిందని.. భార్యను తగలబెట్టిన భర్త

ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో దారుణం జరిగింది. శృంగారం విషయంలో భార్యతో వాగ్వాదం పెట్టుకున్న భర్త.. ఆ తర్వాత భార్యకు నిప్పంటించాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ కేసులో 46 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి శనివారం తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం దినేష్ అవ్హాద్ తన భార్యతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని అనుకున్నాడు. అయితే ఆమె ఇతర పనుల కారణంగా శృంగారానికి నిరాకరించిందని ఆర్‌సిఎఫ్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.

"ఆ మహిళ ఇంటి పనిమనిషిగా పనిచేస్తుంది. ఆమె శృంగారం నిరాకరించడంతో చెలరేగిన వాదన మధ్య, ఆ మహిళ కోపంతో తనపై కిరోసిన్ పోసుకుంది. ఆమె అగ్గిపుల్ల వెలిగించలేక పోయిన సమయంలో, అవ్హాద్ గ్యాస్ స్టవ్ నుండి ఒక కాగితాన్ని వెలిగించి ఆమెపై విసిరాడు. ఆమెకు తీవ్ర కాలిన గాయాలు అయ్యాయి. ఆమెను వెంటనే సియోన్ ఆసుపత్రిలో చేర్పించారు" అని అధికారి తెలిపారు. మహిళ ఫిర్యాదు ఆధారంగా, హత్యాయత్నం, ఇతర నేరాలకు సంబంధించి భారతీయ న్యాయ సంహిత నిబంధనల కింద అవద్‌ను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.

Next Story