మహిళ ముందు లిఫ్ట్ లో అదే పనిగా అసభ్యమైన పని..!

Man touches self in front of woman in lift. ముంబై లోని తలోజాలోని నివాస భవనంలోని లిఫ్ట్ లోపల మహిళ ముందు తన ప్రైవేట్ భాగాలను తాకిన

By M.S.R  Published on  11 Jan 2023 5:00 PM IST
మహిళ ముందు లిఫ్ట్ లో అదే పనిగా అసభ్యమైన పని..!

ముంబై లోని తలోజాలోని నివాస భవనంలోని లిఫ్ట్ లోపల మహిళ ముందు తన ప్రైవేట్ భాగాలను తాకిన 30 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు మహిళను కూడా అనుచితంగా తాకాడు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. భవనంలోని మరో వ్యక్తి ఈ విషయాన్ని తెలుసుకుని నవీ ముంబై పోలీసులకు సమాచారం అందించాడు.

గత శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత మహిళ పని మనిషి అని తెలుస్తోంది. శుక్రవారం ఉదయం మహిళ పని నిమిత్తం తలోజాలోని మార్బుల్ ఆర్చ్‌లోని ఫ్లాట్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఆమెతో పాటు లిఫ్ట్‌లో ఉన్న నిందితుడు గ్రౌండ్‌ ఫ్లోర్‌ నుంచి 12వ అంతస్తు వరకు లిఫ్ట్ వెళ్లే సమయంలో తన ప్రైవేట్‌ భాగాలను తాకుతూనే ఉన్నాడు. ఈ సంఘటన ఉదయం 9.51 గంటలకు జరిగింది. ఆ తర్వాత సదరు మహిళ పనికి వెళ్లింది. ఆ రోజు మహిళ ఉదయం 10.43 గంటలకు భవనం నుండి బయటకు బయలుదేరినప్పుడు, ఆ వ్యక్తి లిఫ్ట్ ముందు కావాలనే మహిళను తాకాడని తలోజా పోలీస్ స్టేషన్‌కు చెందిన ఒక పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. అయితే ఆ మహిళ ఫిర్యాదు చేయలేదు. అదే భవనంలో ఫ్లాట్‌ ఉన్న అడ్వకేట్‌ జావేద్‌ ఖాన్‌ ఆదివారం జరిగిన విషయం తెలుసుకుని నవీ ముంబై పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు భవనానికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో, నిందితుడు మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నాడని.. థానే మెంటల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడని పోలీసు అధికారులు తెలుసుకున్నారు.


Next Story