'నేను నా భార్యను చంపాను.. నన్ను అరెస్ట్ చేయండి'

Man strangulates wife to death over infidelity in Uttarpradesh, then surrenders. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో దారుణ ఘటన జరిగింది. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం

By అంజి  Published on  26 Jan 2023 4:51 PM IST
నేను నా భార్యను చంపాను.. నన్ను అరెస్ట్ చేయండి

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో దారుణ ఘటన జరిగింది. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆరోపిస్తూ ఓ వ్యక్తి తన భార్యను గొంతు కోసి హత్య చేసి, ఆపై పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. రాజ్‌ఘాట్ ప్రాంతంలోని ఖుర్రంపూర్ ప్రాంతానికి చెందిన శరద్‌చంద్ర పాల్ అనే వ్యక్తి తన కుమారుడి వయస్సు గల వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో అతని భార్య నీలంను హత్య చేశాడు.

'నేను నా భార్యను చంపాను'

భార్యను గొంతు కోసి హత్య చేసి, లొంగిపోవడానికి రాజ్‌ఘాట్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. అతను ఒక పోలీసుతో "నేను నా భార్యను చంపాను, నన్ను అరెస్టు చేయండి" అని చెప్పాడు. దీంతో ఆ పోలీసు షాక్ అయ్యాడు. పోలీసులు వెంటనే అతడి ఇంటికి చేరుకుని విచారణ చేపట్టగా ఇంట్లో భార్య శవమై కనిపించింది. అనంతరం నిందితుడైన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు.

వివాహేతర సంబంధంమే హత్యకు దారితీస్తుందా?

విచారణలో తన భార్య నీలమ్ తన కంటే 25 ఏళ్లు చిన్నవాడైన వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆ వ్యక్తి వెల్లడించాడు. ఈ విషయమై వారి మధ్య చాలా గొడవలు జరిగేవి. పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినా ఆమెలో మార్పు రాలేదు. బుధవారం పిల్లలు ఇంట్లో లేని సమయంలో ఇదే విషయమై భార్యాభర్తలిద్దరూ మరోసారి గొడవకు దిగారు. ఆవేశానికి లోనైన భార్య గొంతు నులిమి హత్య చేశాడు. నిందితుడు స్వయంగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నేరం అంగీకరించాడని పోలీస్ స్టేషన్ రాజ్‌ఘాట్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ రాజేంద్ర సింగ్ తెలిపారు.

నిందితుడిని అరెస్టు చేశామని, పోస్టుమార్టం నివేదిక రావాల్సి ఉందని తెలిపారు.

Next Story