ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తనతో మాట్లాడేందుకు నిరాకరించినందుకు ఓ వ్యక్తి.. 20 ఏళ్ల మహిళను స్క్రూడ్రైవర్‌తో 51 సార్లు పొడిచి హత్య చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎస్‌ఇసిఎల్) పంప్ హౌస్ కాలనీలో డిసెంబర్ 24న ఈ ఘటన జరిగిందని సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (కోర్బా) విశ్వదీపక్ త్రిపాఠి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు అక్కడికి వచ్చేసరికి బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆమె అరుపులు బయటకు వినపడకుండా ఉండేందుకు ఆమె నోటిని దిండుతో కప్పి, స్క్రూడ్రైవర్‌తో 51 సార్లు పొడిచాడు
బాధితురాలి సోదరుడు ఇంటికి వచ్చిన తర్వాత రక్తపు మడుగులో మృతదేహాన్ని చూశాడని అధికారి తెలిపారు. జష్‌పూర్ జిల్లాకు చెందిన నిందితుడు మూడేళ్ల క్రితం ఓ ప్యాసింజర్ బస్సులో కండక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు బాధితురాలితో స్నేహం చేశాడని, ఆ మహిళ ఆ బస్సులో ప్రయాణించేదని ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. నిందితుడు తర్వాత గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు పని కోసం వెళ్లాడు. ఇద్దరూ ఫోన్‌లో టచ్‌లో ఉన్నారు. మహిళ అతనితో ఫోన్‌లో మాట్లాడటం మానేసిన తర్వాత, నిందితుడు ఆమె తల్లిదండ్రులను కూడా బెదిరించాడని అధికారి తెలిపారు. కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడి కోసం నాలుగు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.