ఆడ పిట్‌బుల్‌ కుక్కను అతి దారుణంగా చంపేశారు

Man stabs pitbull to death with sharp weapon in Uttar Pradesh's Muzaffarnagar. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఆడ పిట్‌బుల్‌ కుక్కను పదునైన ఆయుధంతో పొడిచి చంపారు.

By M.S.R  Published on  24 March 2023 3:46 PM IST
ఆడ పిట్‌బుల్‌ కుక్కను అతి దారుణంగా చంపేశారు

Man stabs pitbull to death with sharp weapon


ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఆడ పిట్‌బుల్‌ కుక్కను పదునైన ఆయుధంతో పొడిచి చంపారు. గురువారం ఉదయం తన యజమానితో కలిసి నడుచుకుంటూ వెళుతున్న ఆడ పిట్‌బుల్‌పై ఓ వ్యక్తి పదునైన ఆయుధంతో దాడి చేశాడు. ఆ కుక్క యజమాని నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానిక పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు కుక్క మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించి నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 429, 506 కింద కేసు నమోదు చేశారు.

కుక్క యజమాని నితిన్ పాండే మాట్లాడుతూ, తాను ఉదయం తన కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్లానని, రవి కుమార్ అనే వ్యక్తి తన కుక్కపై వెనుక నుండి దాడి చేయడంతో అది తీవ్రంగా గాయపడింది. యజమాని వెంటనే కుక్కను వెటర్నరీ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆ కుక్క చనిపోయింది. కుక్క యజమానులు నిందితులపై చార్తావాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేసినట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ యతేంద్ర నగర్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story