షాకింగ్‌.. మేనల్లుడి ప్రైవేట్ పార్ట్‌పై కాల్చాడు

రాజస్థాన్‌లో ఓ వ్యక్తి తన మేనల్లుడిని ప్రైవేట్ పార్ట్‌లో కాల్చిన షాకింగ్ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

By అంజి  Published on  26 Feb 2023 3:45 PM IST
షాకింగ్‌.. మేనల్లుడి ప్రైవేట్ పార్ట్‌పై కాల్చాడు

రాజస్థాన్‌లో ఓ వ్యక్తి తన మేనల్లుడిని ప్రైవేట్ పార్ట్‌లో కాల్చిన షాకింగ్ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన కెమెరాకు కూడా చిక్కింది. రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వ్యక్తిగత వివాదంతో ఓ వ్యక్తి తన మేనల్లుడిపై కాల్పులు జరిపి తీవ్రంగా గాయపరిచాడు. ఆస్తి తగాదాల కారణంగా మేనల్లుడి ప్రైవేట్ పార్ట్‌పై కాల్చాడు. ఈ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

ఈ దారుణ ఘటన కెమెరాకు చిక్కింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. నిందితుడిని బగాగా గుర్తించారు. నిందితుడు తన మేనల్లుడు ప్రైవేట్ పార్ట్స్ లో కాల్చి చంపినట్లు సమాచారం. జిల్లాలోని బీవర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు తన మేనల్లుడి వ్యవసాయ భూమిలో మట్టిని తవ్వి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ చర్య కారణంగా, బాధితుడు అతన్ని హెచ్చరించాడు. బాధితుడిని హమీద్‌గా గుర్తించారు.

హమీద్ తన మామను తన భూమి నుండి మట్టిని తవ్వవద్దని చెప్పడంతో నిందితుడు తన డబుల్ బ్యారెల్ రైఫిల్‌ను తీసి వెంటనే అతని ప్రైవేట్ పార్ట్‌పై కాల్చాడు. బాధితుడు హమీద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స కొనసాగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బాధితుడు స్వయంగా చిత్రీకరించాడు. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో హల్‌చల్ చేస్తోంది. వీడియో చూసిన ప్రజలు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం నిందితుడైన మామపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Next Story