Nalgonda : మైనర్‌ బాలికపై అత్యాచారం, హత్య.. నిందితుడికి ఉరిశిక్ష విధించిన కోర్టు

2013 ఏప్రిల్‌లో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో 24 ఏళ్ల వ్యక్తికి తెలంగాణలోని నల్గొండ జిల్లాలోని ఒక కోర్టు గురువారం మరణశిక్ష విధించింది

By Medi Samrat
Published on : 14 Aug 2025 6:45 PM IST

Nalgonda : మైనర్‌ బాలికపై అత్యాచారం, హత్య.. నిందితుడికి ఉరిశిక్ష విధించిన కోర్టు

2013 ఏప్రిల్‌లో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో 24 ఏళ్ల వ్యక్తికి తెలంగాణలోని నల్గొండ జిల్లాలోని ఫోక్సో కోర్టు గురువారం మరణశిక్ష విధించింది. లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం, భారత శిక్షాస్మృతిలోని సంబంధిత నిబంధనల ప్రకారం నిందితుడైన వ్యక్తిని ప్రత్యేక పోక్సో కోర్టు దోషిగా నిర్ధారించింది. రూ. 1.10 లక్షల జరిమానా కూడా విధించిందని నల్గొండ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శరత్ చంద్ర పవార్ తెలిపారు. వినికిడి, ప్రసంగ లోపం ఉన్న నిందితుడి విచారణ 12 సంవత్సరాలు కొనసాగింది.

ప్రాసిక్యూషన్ ప్రకారం, నిందితుడి కాలనీలోనే నివసిస్తున్న బాధితురాలిపై లైంగిక దాడి చేసి, గొంతు నులిమి చంపారు. తరువాత ఆమె మృతదేహాన్ని డ్రైనేజీ కాలువలో పడేశారు. బాలిక కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు మొదట మిస్సింగ్ కేసు నమోదు చేశారు. తరువాత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని ఫలితంగా నిందితుడిని అరెస్టు చేసి, తరువాత జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

Next Story