నానమ్మపై లారీ ఎక్కించి హతమార్చిన మనవడు.. ఎందుకంటే..!

Man runs over grandmother with truck. బీహార్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. నానమ్మ రోజు ఇంట్లో గొడవలకు కారణమవుతోందని ఆమెపై లారీ ఎక్కించి హత

By అంజి  Published on  18 Oct 2021 8:55 AM IST
నానమ్మపై లారీ ఎక్కించి హతమార్చిన మనవడు.. ఎందుకంటే..!

బీహార్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. నానమ్మ రోజు ఇంట్లో గొడవలకు కారణమవుతోందని ఆమెపై లారీ ఎక్కించి హతమార్చాడు మనవడు. ప్రశాంతంగా ఉన్న ఇంట్లో నానమ్మ కుటుంబ కలహాలు రేపుతోందని ఆమెపై కోపం పెంచుకున్న మనవడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ముజఫ్పర్‌లోని రాక్సాలో జరిగింది. రాక్సాలోని ఓ కుటుంబానికి చెందిన దిలీప్‌ లారీ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. దసర పండుగ రావడంతో ఇంటికి దిలీప్‌ ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఎప్పటినుండో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ప్రశాంతంగా పండుగ జరుపుకుందామని ఇంటికి వచ్చిన దిలీప్‌కు కుటుంబ గొడవలు ఆగ్రహాం తెప్పించాయి.

ఈ గొడవలకు కారణం నానమ్మేనని ఆమెతో వాగ్వాదానికి దిగాడు. దిలీప్‌ను తండ్రి రాజేశ్వర్‌ రాయ్‌ అడ్డుకున్నాడు. ఆ తర్వాత దిలీప్‌ను ఇంటి నుంచి బయటకి పంపించాడు. అప్పటికే నానమ్మపై కోపంతో ఉన్న ఆ యువకుడు.. ఆదివారం ఉదయం ఇంటి బయట రోడ్డుపై ఉన్న ఆమెపై లారీ ఎక్కించాడు. దీంతో ఆ వృద్ధురాలు అక్కడికక్కడే మృత్యువాత పడింది. దిలీప్‌ తండ్రి రాజేశ్వర్‌ రాయ్‌ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కుటుంబ కలహాలతో జరిగిన ఈ హత్యపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Next Story