బీహార్‌లోని పాట్నాలో వీధికుక్కపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫూల్వారీ షరీఫ్‌లోని ఫైసల్ కాలనీలో మార్చి 8న హోలీ రోజున ఈ సంఘటన జరిగింది. ఘటనకు సంబంధించిన క్రమమంతా సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డవ్వడంతో.. స్థానిక ఎన్జీవో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫుల్వారీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో ఓ ఎన్జీవో దరఖాస్తు సమర్పించడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీలో కాలనీలోని కుక్కపై ఆ వ్యక్తి అసహజంగా ప్రవర్తించడం కనిపించిందని వార్తా సంస్థ ANI కూడా నివేదించింది. ఫుల్వారీ షరీఫ్ ఏఎస్పీ మనీష్ ఘటనను ధృవీకరించారు. జంతువులపై క్రూరత్వం ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తామని చెప్పారు. అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఫుల్వారీ షరీఫ్) మనీష్ కుమార్ మాట్లాడుతూ.. ఒక అప్లికేషన్ వచ్చింది. ఐపీసీ, జంతు చట్టం కింద చర్యలు తీసుకుంటాం. ఈ విషయంపై విచారణ జరుగుతోందని తెలిపారు.