మధ్యప్రదేశ్ ఆర్థిక రాజధాని ఇండోర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి స్నేహితుడు.. అతడి భార్య నమ్మకాన్ని చూరగొని తన సాన్నిహిత్యాన్ని పెంచుకున్నాడు. ఆ తర్వాత మహిళపై అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు చందన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనిది. మహిళ తన భర్త జైలులో ఉన్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అతను జైలుకు వెళ్లిన తర్వాత ఆమె భర్త స్నేహితుడు సయీద్ ఇంటికి వచ్చాడు.
తన భర్తకు బెయిల్ ఇప్పించి ఆదుకుంటానని హామీ ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత సయీద్ తనతో శారీరక సంబంధాలు పెట్టుకోవాలని బలవంతం చేశాడని మహిళ తెలిపింది. ఆ తర్వాత భర్త జైలు నుంచి బయటకు రాగానే ఓ రోజు సయీద్ తన స్నేహితులు సమీర్, సత్తార్‌లతో కలిసి వచ్చి ఆమెను బెదిరించి అత్యాచారం చేశారు. ఆ సమయంలో ఆమె భర్త ఇంట్లో లేడు. సయీద్ తన ఇద్దరు స్నేహితులను బయట నిలబడి చూసేలా చేసి ఇంటికి వచ్చి మళ్లీ తనపై అత్యాచారం చేశాడని మహిళ ఆరోపించింది.
భర్త ఇంటికి రాగానే తనకు జరిగిన బాధను వివరించింది. దీంతో అతను ఒక్కసారిగా షాకయ్యాడు. ఆ మహిళ తన భర్తతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. సయీద్, అతని స్నేహితులపై అత్యాచారం సహా ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి సయీద్ ఇద్దరు స్నేహితులను అరెస్టు చేసినట్లు చందన్ నగర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ దేవేంద్ర మిశ్రా తెలిపారు. సయీద్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.