అమృత్‌సర్‌లో ఆదివారం ఉదయం హర్‌మందిర్ సాహిబ్ (స్వర్ణ దేవాలయం)కి వెళ్తుండగా ఒక వ్యక్తిని.. భార్య, ఇద్దరు పిల్లల ముందే కాల్చి చంపారని పోలీసులు తెలిపారు. అమృత్‌సర్ నగరంలోని ఛెహర్తా ప్రాంతానికి చెందిన హరీందర్ సింగ్ అనే బాధితుడు దుబాయ్‌లో పనిచేస్తూ ఐదు రోజుల క్రితమే ఇంటికి తిరిగి వచ్చాడని పోలీసులు తెలిపారు. తిరిగి వచ్చిన తర్వాత బైక్‌పై తొలిసారిగా హర్‌మందిర్ సాహిబ్‌కు వెళ్తున్నాడని పోలీసులు గుర్తించారు.
CCTV ఫుటేజీ ప్రకారం.. దాడి చేసిన వ్యక్తులు హరీందర్, అతని కుటుంబ సభ్యులని అనుసరించడం ప్రారంభించారు. హరీందర్ భార్య ప్రకారం, దాడి చేసిన వ్యక్తులు తమ దగ్గర ఉన్న విలువైన వస్తువులను లాక్కోవడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో అతను ప్రతిఘటించాడు. అది గొడవకు దారితీసిందని, ఆ సమయంలో వారు అతనిని కాల్చి చంపారని ఆమె పోలీసులకు తెలిపింది. హరీందర్ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో స్నాచింగ్ సహా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
గత 24 గంటల్లో అమృత్‌సర్ నగరంలో తుపాకీ కారణంగా జరిగిన రెండో హత్య ఇది. శనివారం మధ్యాహ్నం, కాంగ్రెస్ కౌన్సిలర్ కొడుకు కాల్పులు జరపడంతో ఒకరు మరణించారు. మరొకరు గాయపడ్డారు. వార్డ్ నంబర్ 45 నుండి కాంగ్రెస్ కౌన్సిలర్ దల్బీర్ కౌర్ కుమారుడు చరణ్‌దీప్ సింగ్ బబ్బా, భూమి వివాదంపై రెండు వర్గాల మధ్య ఘర్షణ సందర్భంగా పోలీసుల సమక్షంలోనే కాల్పులు జరిపాడు.