గాలిపటం మంజా.. గొంతు కోయడంతో భర్త మృతి.. భార్యకు గాయాలు

Man on bike dies after banned manjha slits his throat in Mancherial. తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో శనివారం బైక్‌పై తన బంధువును కలిసేందుకు వెళ్తుండగా నిషేధిత గాజు పూతతో కూడిన

By అంజి  Published on  16 Jan 2022 10:21 AM IST
గాలిపటం మంజా.. గొంతు కోయడంతో భర్త మృతి.. భార్యకు గాయాలు

తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో శనివారం బైక్‌పై తన బంధువును కలిసేందుకు వెళ్తుండగా నిషేధిత గాజు పూతతో కూడిన గాలిపటం తీగ (మంజా)తో గొంతు కోయడంతో భర్త భీమయ్య మృతి చెందాడు. భీమయ్య అనే బాధితుడు తన భార్యతో కలిసి మోటార్ సైకిల్ పై వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్రగాయాలతో మాంజా మెడకు చుట్టుకోవడంతో తీవ్ర రక్తస్రావంతో భీమయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. అతడిని కాపాడేందుకు భార్య ప్రయత్నించినా ఫలించలేదు. అయితే బైక్‌పై నుండి కిందపడిన ఆమెకు కూడా గాయాలయ్యాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా మంచిర్యాల హైవేపై భార్యాభర్తలు వెళ్తుండగా ఈ విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్షకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నైలాన్ థ్రెడ్‌లపై పూర్తి నిషేధం

దేశవ్యాప్తంగా సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగురవేయడంలో నైలాన్ లేదా సింథటిక్ దారాన్ని ఉపయోగించడంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధం విధించింది. పక్షులతో పాటు మనుషులను రక్షించేందుకు మాంజా సేకరణ, నిల్వలు, విక్రయాలు, వినియోగంపై పూర్తి నిషేధం విధిస్తూ తెలంగాణ అటవీశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో సంక్రాంతి పండుగ 2022 సందర్భంగా సింథటిక్ మాంజా విక్రయాలు మరియు కొనుగోలును తనిఖీ చేయడానికి జిల్లాల్లో ఇలాంటి మొబైల్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు. నిషేధ ఉత్తర్వులను అమలు చేయడానికి సంబంధిత జిల్లా అటవీ అధికారులు మొబైల్ పార్టీలను కూడా ఏర్పాటు చేశారు. అవగాహన ప్రచారాన్ని కూడా ప్రారంభించారు.

Next Story