పాపం.. వివాహితతో పారిపోయాడని ముక్కు కోశారు

రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో దారుణ ఘటన జరిగింది. వివాహితతో పారిపోయిన వ్యక్తి ముక్కు కోసినందుకు ఐదుగురు

By అంజి  Published on  21 March 2023 8:01 AM GMT
Rajasthan, Crime news

వివాహితతో పారిపోయాడని ముక్కు కోశారు 

రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో దారుణ ఘటన జరిగింది. వివాహితతో పారిపోయిన వ్యక్తి ముక్కు కోసినందుకు ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నాగౌర్ జిల్లాలో జరిగిన ఈ నేరాన్ని నిందితులు రికార్డు చేసి సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశారు. పర్బత్‌సర్‌కు చెందిన బాధితుడు జనవరిలో పెళ్లైన మహిళతో పారిపోయి అజ్మీర్‌లో నివసిస్తున్నాడ. మహిళ కుటుంబ సభ్యులు ఆ వ్యక్తిని అపహరించి, వ్యవసాయ యంత్రాన్ని ఉపయోగించి అతని ముక్కును కత్తిరించారు.

నిందితులు తనను కర్రలు, రాడ్‌లతో దారుణంగా కొట్టారని, మరోత్ సరస్సు దగ్గరకు తీసుకెళ్లి వీడియో తీయడమే కాకుండా ముక్కు కోశారని బాధితుడు తన పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాడు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను మహిళ సోదరుడు, ఇతర బంధువులు కిడ్నాప్ చేసి, నాగౌర్ జిల్లాలోని ఒక గ్రామానికి తీసుకెళ్లారని, అక్కడ వారు అతని ముక్కును కోసారని తెలిపాడు.

ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వివాహిత తన ప్రియుడు హమీద్‌తో కలిసి పారిపోయినట్లు ప్రాథమికంగా తేలింది. ఈ విషయం మహిళ తండ్రికి తెలియడంతో ఇద్దరినీ విడదీశాడు. మహిళ సోదరులు, తండ్రి కలిసి.. హమీద్‌ ముక్కును కోసి, వీడియోను ప్రసారం చేశారని రూపిందర్ సింగ్, ఐజి అజ్మీర్ చెప్పారు. అజ్మీర్‌లోని గోగ్లీ పోలీస్ స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీడియో వైరల్ కావడంతో వెంటనే నిందితులను అరెస్ట్ చేసినట్లు నాగౌర్ పోలీస్ సూపరింటెండెంట్ రామమూర్తి జోషి తెలిపారు.

Next Story